శ్రీ పీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణనంద కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా దాడులు ఆగడం లేదన్నారు పరిపూర్ణానంద. దేవాలయాల పరిరక్షణ కోసం సామాజిక సృహ పెరగాలన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండ అత్యంత పాశవికం అన్నారు. కరోనా ఆంక్షలు పేరుతో హిందూ పండగలను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కరోనా ప్రభుత్వానికి పట్టింది.. సమాజానికి పట్టలేదన్నారు.
దేవాలయ భూములు హిందువులే కోల్పోతున్నారని, మతమార్పిడులు ఇప్పటికిప్పుడు జరగడం లేదు. దశాబ్దాలుగా జరుగుతూనే వున్నాయన్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ ఏపీ లో పెడితే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. తమిళనాడులో మాజీ ముఖ్య మంత్రి జయలలిత యాంటీ కన్వర్షన్ బిల్ (మత మార్పిడుల వ్యతిరేక బిల్ )అమలు చేసిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. హిందూ దేవాలయాలు ఆర్ధిక వనరులుగా మారిపోయాయని, దేవాదాయశాఖ రద్దు నిర్ణయం సరైంది కాదని, దానిని సంస్కరించాలన్నారు.