నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ సీయం జగన్. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో 11,775 వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నేడో, రేపో ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
కొత్తగా పీహెచ్‌సీల నిర్మాణం జరుగుతుండటంతో ఈ పోస్టులకు అదనంగా మరో3,176 భర్తీకి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వీటికి కూడా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఏపీలో వైద్య సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.