కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం మళ్ళీ పరీక్షలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది ఇంటర్ విద్య జే.ఏ.సి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తూ, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే […]
గత నెలలో అక్కినేని నాగ చైతన్య, సమంతలు వైవాహిక జీవితం నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సమంత క్యారక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. సినీనటి సమంత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తన పరువుకు భంగం కలిగించాయని పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. Read Also:సమంత కేసులో […]
కరోనా అయిపోయింది అనుకోవద్దు..అందరూ రెండు డోసులు తీసుకోవాలి.. కరోనా ప్రభావం ఉంది.. వాక్సిన్ తీసుకున్న వాళ్లకు ప్రమాదం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా, ప్రజలంతా అప్రమత్తంగా వుండాలన్నారు. థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదని, ప్రభుత్వం మాత్రం సన్నద్దంగా ఉందన్నారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఇకపై ఆక్సిజన్ లోటు రాదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతోందన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు ఈ నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ పాలన, వైసీపీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు నేను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద […]
చంద్రబాబులా కుట్రలు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదన్నారు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. ప్రజా బలంతో జగన్ గెలిచారన్నారు. విశాఖ తగరపువలస రెండో రోజు జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న అదరణ చూసి ఓర్వలేక తన తొత్తు అయిన పట్టాభితో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారని విమర్శించారు తానేటి వనిత. రాష్ట్రం లో అలజడి,శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని ప్రజాదరణ కోల్పోతున్న తెలుగుదేశం […]
గత కొంతకాలంగా చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ తమ భూభాగంలో భాగమే అని, తప్పని సరిగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా చెబుతూ వస్తున్నది. కొన్ని రోజులుగా తైవాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా జెట్ విమానాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే చైనా ఆ దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే, తైవాన్‌పై డ్రాగన్ దాడిచేస్తే తైవాన్‌కు అండగా పోరాటం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ […]
సత్యజిత్ రే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని కేంద్రం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు వివరాలను వెల్లడించారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్లు మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలకు అవార్డులు అందచేస్తామని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవాలో జరిగే 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు అందచేస్తామన్నారు. మార్టిన్ స్కోర్సెస్, ఇస్టావెన్ స్జాబోలు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. స్కోర్సెస్ అనేక […]
1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత భారత దేశంతో యూరప్ దేశాల నుంచి వాణిజ్యం మొదలైంది. ఇలా 1600 సంవత్సరంలో భారత్‌లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఇంగ్లాండ్ కు చెందిన సర్ థామస్ మూడేళ్లు కష్టపడి ఇండియాలో ఈస్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఇలా ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు వేగంగా ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా దేశంలో బలాన్ని పెంచుకున్నారు. 50 ఏండ్ల కాలంలో […]
ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మంటలు వేడిరాజేస్తూనే వున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ దైన రీతిలో మండిపడుతూనే వున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతంలో చేసి ఉంటే అడ్రస్ లేకుండా ఉండేవాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 2024లో చంద్రబాబుని రాష్ట్రం నుండి పంపిచేస్తే […]
ఇప్పుడంటే రకరకాల ఆహారపదార్ధాలు అందుబాటులోకి వచ్చాయి. చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి ఆహారం అందుబాటులో ఉన్నది. అయితే, రాబోయే రోజుల్లో వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి ప్రత్యామ్మాయం కీటకాలతో తయారు చేసిన వంటలే అని అంటున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో, అడవుల్లో నివశించే ప్రజలు మిడతలు, ఉసుళ్లు, చీమలు వంటి వాటిని ఆహారంగా తీసుకునేవారు. ఉసుళ్లతో చేసిన ఆహారం, వేపుళ్లు రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి మంచిది కూడా. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. […]