ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వ కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ నాయుడు పై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు […]
దేశవ్యాప్తంగా బీసీల మీద కుట్ర జరుగుతోందని.. అంతా అప్రమత్తంగా వుండి ఎదుర్కోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. హుజూరాబాద్ లోనే కాదు… దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దోపిడీని ఎత్తిచూపిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో దండోరా వేస్తాం అన్నారు ఆర్ కృష్ణయ్య. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల మీద కనిపించని కుట్ర జరుగుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. పేద వర్గాలను లేబర్ గా ఉంచాలన్నదే కేంద్రం కుట్రగా కనిపిస్తోందన్నారు. […]
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు […]
ఆనంద్ మహీంద్రా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ప్రతి చిన్న విషయంపై స్పందిస్తారు. కొన్ని ఫోటోలు చూసి ఆయన పెట్టే పోస్టులు కూడా చాలా కొత్తగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఆయనకున్న ఫాలోయింగ్‌తో అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వ్యాపార వేత్త కావడంతో ఆయన ఆలోచనలు, సోషల్ మీడియాలో చేసే పోస్టులు కూడా అదేవిధంగా ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అనురాగ్ చిరిమార్ కి అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. […]
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ హాట్ రాజకీయం నడుస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లోనే భోజనం చేసి అందులోనే పడుకునే కేటీఆర్ ఆరు రోజుల తర్వాత నా ట్వీట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కేసీఆర్ […]
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. బద్వేల్ ప్రాంతంలో ఎన్నికల సంఘం ఆంక్షలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మొబైల్స్ పంపిణీ చేశారు డాక్టర్లు. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని 43 మంది ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ చేయడం వివాదాస్పదం అవుతోంది. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం శాంసంగ్ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లు, చేతి […]
నీతోనే ప్రేమ.. నీవే నా సర్వస్వం అంటూ తిరిగాడు. చివరాఖరికి పెళ్లి మాటెత్తితే ముఖం చాటేశాడు. ఓ ప్రేమికుడి మోసానికి బలయిన యువతి అతని ఇంటిముందే నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామంలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది ఆ యువతి. యువతితో నిశ్చితార్థం చేసుకొని మరో యువతిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. న్యాయం చేయాలంటూ యవకుడి ఇంటిముందు నిరసన తెలుపుతోంది యువతి. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని […]
దేవుడి పూజకు ఎక్కడైనా వివిధ రకాల పూవులు దొరుకుతాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న కీలపట్ల కోనేటిరాయస్వామికి పుష్పాలు కరువు అయ్యాయి. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు హిందూ పరిరక్షణ సమితి సభ్యులు. అక్కడ పుష్పాలంకరణ లేని కారణంగా అదేంటని అక్కడి అధికారులను వివరణ కోరగా,, గత కొన్ని నెలలుగా టిటిడి వారు పుష్పాలను సరఫరా ఆపేశారని తెలియజేశారు. హిందువుల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బతినే […]
హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ పై మాటల తూటాలు పేల్చారు. క్యాబినెట్‌లో ఉన్న వాళ్లలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు ఈ మధ్య కాంగ్రెస్ మీద ప్రేమ ఎక్కువైందన్నారు. భట్టి మంచోడు అంటాడు, మంచోడైన భట్టిని ప్రతిపక్ష హోదా నుంచి ఎందుకు తీసేశాడో సమాధానం చెప్పాలన్నారు. గాంధీ భవన్‌కు గాడ్సే రావడం కాదు టీఆర్ఎస్ […]
హుజురాబాద్ బైపోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. హుజురాబాద్ మండలం సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వి అన్ని అబద్ధాలు, మోసాలేనని అన్నారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీటింగ్‌కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. పిల్లిని రూంలో వేసి కొడితే […]