భారత దేశంలో ప్రకృతికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో తెలిసిందే. ఇక జంతువులను వివిధ రకాల దేవతల పేరుతో కొలుస్తుంటారు. ఆవును పూజిస్తే మూడు కోట్ల దేవతలను పూజించినట్టే అని చెబుతారు. ఇక, ఎద్దును నందీశ్వరుడిగా పూజిస్తారు. కొన్ని చోట్ల కొన్ని రకాల ఎద్దులను నిత్యం ప్రజలు పూజిస్తుంటారు. విశాఖపట్నంలోని రిషికొండ ఒమ్మివాని పాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒమ్మి గడ్డెన్న అనే కుటుంబానికి చెందిన దేవుడు తౌడు పెద్దు అనే ఎద్దు ఉన్నది. ఈ […]
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలా కుతలం చేస్తున్నది. కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది. అయినప్పటికీ ఇప్పటి వరకు మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు. ఎప్పటి కప్పుడు కొత్తగా మార్పులు చెందుతూ విరుచుకుపడుతున్నది. దేశాల ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తోంది కరోనా. ఇక, కరోనా కట్టడికి ప్రతీ దేశం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ వస్తున్నాయి. అన్నింటికంటే అధికంగా బ్రిటన్ కరోనా కట్టడికోసం […]
సాధారణంగా కంపెనీ లాభాల బాట పడితే అందులో పనిచేసే ఉద్యోగులకు ప్రైవేటు సంస్థలు బోనస్‌లు ఇస్తుంటారు. కంపెనీ కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులకు వారి జీతాలను అనుసరించి బోనస్‌లు ప్రకటిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ అనే లేడీ బాస్ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అద్భుతమైన కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రపంచంలో ఉద్యోగులు ఎక్కడికైనా వెళ్లి వచ్చేందుకు రెండు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లు, ఖర్చుల కోసం రూ.7.5 లక్షల రూపాయలు అందిస్తున్నట్టు […]
సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే జాలర్లకు ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. చాలా కాలంగా పశ్చిమ బెంగాల్‌లోని దిఘా జాలర్లు సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని వేటను కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే 10 మంది జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అనూహ్యంగా వారి వలకు అరుదైన జాతికి చెందిన 33 తెలియా భోలా చేపలు చిక్కాయి. ఈ […]
ఉదయాన్నే ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటోలు ఆపుతుంటారు. ఆటో ఆగిన తరువాత ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతారు. ఆ తరువాత అందులోని వ్యక్తులను తీసుకొని వెళ్తారు. ఎవరు వారంతా, ఎందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానాలు రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో పొన్నారి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పత్తిపంట చేతికి వచ్చిన తరువాత పత్తిని తీసేందుకు కూలీల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల […]
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు కలిగించిన కరోనా, మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 3.2 కోట్ల మందికి సంబంధించిన ఆరోగ్య విషయాలపై పరిశోధనలు చేశారు. కరోనా సోకిన 28 రోజుల తరువాత లేదా అస్త్రాజెనకా వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరువాత నాడీ సంబంధమైన సమస్యలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి అనే అంశంపై పరిశోధనలు నిర్వహించారు. తొలిడోసు వ్యాక్సిన్ […]
దేశంలో డ్రోన్ల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రక్షణ, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాలలో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో దీనికోసం కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రణాళికలు తయారు చేసింది. విమానాల నియంత్రణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఉన్నది. అయితే, డ్రోన్‌లను మానవ రహిత విమానాలుగా పిలవాల్సి ఉంటుంది కాబట్టి వీటికోసం ప్రత్యేక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను […]
వైపీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు చంద్రబాబు రారాజు అని, ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా? ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా అని ప్రశ్నాంచారు. పట్టాభి బూతు పురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా? అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు […]
పంజాబ్‌లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్ […]
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తప్పుకున్నాక ఆ దేశంలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలు మళ్లీ తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఆఫ్ఘన్లో షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు చేస్తున్నది. ఇటీవలే రెండు నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి వందల సంఖ్యలో మరణాలకు కారణమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గుర్తించక పోవడంతో ఆ దేశంలో ఉగ్రసంస్థల బలం పెరిగే అవకాశం ఉందని, ఇది ఆఫ్ఘన్ దేశానికి మాత్రమే కాకుండా […]