ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తప్పుకున్నాక ఆ దేశంలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలు మళ్లీ తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఆఫ్ఘన్‌లో షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ దాడులు చేస్తున్నది. ఇటీవలే రెండు నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి వందల సంఖ్యలో మరణాలకు కారణమయ్యాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గుర్తించక పోవడంతో ఆ దేశంలో ఉగ్రసంస్థల బలం పెరిగే అవకాశం ఉందని, ఇది ఆఫ్ఘన్ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాబోయే ఆరు నెలల కాలంలో ఆఫ్ఘన్ భూభాగం నుంచి అమెరికాకు ఉగ్రముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని యూఎస్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Read: పెగాసస్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. కేంద్రం ప్రతిపాదన తిరస్కరణ