వైపీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అసాంఘీక శక్తులకు చంద్రబాబు రారాజు అని, ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వచ్చారా? ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా అని ప్రశ్నాంచారు. పట్టాభి బూతు పురాణం వీడియోను రాష్ట్రపతికి చూపించారా? అమిత్ షా మీద రాళ్లు వేసిన వీడియోను చూపించారా? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు 36 గంటల పాటు బూతు దీక్ష చేశారని, పట్టాభి తిట్లను సమర్థించుకోవడానికే బాబు ఢిల్లీకి వచ్చారని అన్నారు. ఆర్టికల్ 356ని రద్దు చేయమని కోరిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే కావాలని అంటున్నారని విమర్శించారు. ఇక, గంజాయి వ్యాపారంలో లోకేష్‌కు భాగస్వామ్యం ఉందని ప్రజలందరికీ తెలుసునని విజయసాయిరెడ్డి తెలిపారు.
Read: కెప్టెన్ సాబ్… ఈసారైనా పార్టీని నిలుపుకుంటారా?