కరోనా కాలంలో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. వన్యప్రాణుల నుంచి వన్యమృగాల వరకు రోడ్లమీదకు వచ్చి సందడి చేశాయి. కాగా, ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఉండే ఆస్ట్రిచ్ పక్షులు సడెన్‌గా పాక్‌లోని లాహోర్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించాయి. ఆస్ట్రిచ్ పక్షులు రోడ్డు మీదకు రావడంతో జనాలు సైతం వాటితో ఫొటోలు దిగేందుకు పోటీ […]
గల్ప్ దేశాల్లో ఒకటైన సిరియాలో చాలా కాలంగా ఉగ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంతర్యుద్ధం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పేలుళ్లు సంభవిస్తాయో అని బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. ప్రాణాలతో బయటపడినవారు, సిరియా నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా గాయపడిన వారిలో ముంజీర్ ఒకరు. సిరియాలో జరిగిన బాంబు దాడిలో తన […]
కరోనా, అంతర్జాతీయ ఆంక్షలతో ఉత్తర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతున్నది. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల రక్షణ, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక, నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ […]
కొన్ని చెట్ల ఆకులు ముట్టుకుంటే ముడుచుకుపోతాయి. కొన్ని తీగలు మెలితిరిగిపోతాయి. అయితే, ఈ చెట్టు అన్నింటికంటే ప్రత్యేకం. ఈ చెట్టు కాండాన్ని పట్టుకుంటే చాలు.. పైనున్న కొమ్మలు ఊగిపోతాయి. దూరం నుంచి ఆ చెట్టును చూసినా దానిలో ప్రతిస్పందనలు కలుగుతాయట. ఈ చెట్టు పేరు రండియా డ్యుమెటోరమ్. వేళ్ల నుంచి కొమ్మల చివరి వరకు చాలా సున్నితమైన సెన్సార్ల వంటి భాగాలు ఇందులో ఉంటాయట. ఉత్తర ప్రదేశ్‌లోని దుద్వా జాతీయ పార్క్‌లోని కటార్నియా వైల్డ్ లైఫ్ […]
తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. జియాంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక రాజ్యాధికార కాంక్ష పెరిగిపోయింది. ఆర్ధిక, సైనిక శక్తిని పెంచుకున్నది. తన దేశాన్ని విస్తరించుకోవాలని చైనా చూస్తున్నది. చుట్టుపక్కల దేశాల సరిహద్దుల్లో రోడ్డు, భవనాలు, ఇతర మౌళిక వసతుల నిర్మాణాల ఏర్పాటు పేరుతో ప్రవేశిస్తు అక్కడ బలాన్ని పెంచుకొని ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది చైనా. ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వాటిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటోంది. ఇప్పుడు తన […]
రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత పరిశ్రమల కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. చమురుతో నడిచే వాహనాలు, విమానాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు సోలార్ వినియోగాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. అయితే, సరైన అవగాహన కల్పించకుంటే ఎంత పెద్ద టెక్నాలజీ అయినా పెద్దగా వినియోగంలోకి రాదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక పనుల కోసం బొగ్గును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బట్టల ఇస్త్రీ కోసం బొగ్గుతో నడిచే ఇస్త్రీ […]
ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 నగరాల్లో న్యూయార్క్ కూడా ఒకటి. అక్కడ జీవించాలంటే ఒక వ్యక్తి సగటు వ్యయం 1341 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం లక్ష రూపాయలు. నెలకు ఇంత ఖర్చు అంటే మనం నోరెళ్లబెడతాం. ఎంత తగ్గించుకున్నా కనీసం వెయ్యి డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఓ మహిళ మాత్రం కేవలం నెలకు 200 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తూ జీవనాన్ని సాగిస్తోంది. అంత ఖరీదైన నగంలో మరీ అంత తక్కువ ఖర్చుతో […]
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పనీ చాలా సులభం అయింది. ఇడ్లీ, దోశలు, చపాతి వంటి బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేయడానికి కూడా మెషీన్‌లను వినియోగిస్తున్నారు. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, చేయి తిరిగిన వంటవాళ్ల ముందు అవన్నీ దిగదుడుపే కదా. ఏది ఎలా వండితే బాగుంటుందో ఒక వంట మనిషికి తెలిసినట్టుగా మెషీన్‌లకు ఎలా తెలుస్తుంది చెప్పండి. పెద్ద పెద్ద హోటల్స్‌లో మెషీన్‌లను వినియోగించినా అక్కడి వంటల టేస్ట్ పెద్దగా ఉండదు. కానీ, స్ట్రీట్ […]
ప్రపంచంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్ కారణంగా ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. వేగంగా ప్రయాణాలు చేయడం కోసం విమానాలు ఎక్కేస్తున్నారు. ఎయిర్‌పోర్టుల వినియోగం పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నది. అయితే, విమానాశ్రయాలను అన్ని ప్రాంతాల్లో నిర్మించడం కుదరని పని. రన్‌వే ఉండాలి. విమానాశ్రయానికి దగ్గరగా పెద్ద పెద్ద బిల్డింగులు ఉండకూడదు. కొన్ని చోట్ల నిర్మించే ఎయిర్‌పోర్ట్‌లు అందర్ని ఆకట్టుకుంటున్నాయి. […]