ఇటలీ ఎయిర్ హోస్టెస్ అర్ధనగ్న ప్రదర్శనలతో కూడిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇటలీలోని అలిటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 50 మంది ఎయిర్‌హోస్టెస్‌లు అర్ధనగ్న నిరసనలకు దిగారు. రోమ్‌లోని టౌన్ హాలు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. జీతంలో కోతలు, ఉద్యోగాలు తొలగించడం పై మనస్తాపం చెంది నిరసనలకు దిగినట్టు చెప్పారు. ఈ మధ్య కాలంలో అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ను తాజాగా ఐటీఏ ఎయిర్‌వేస్ స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామం అలిటాలియా […]
బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సభకు హాజరైన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార టీఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి టీఆర్ఎస్ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గొర్లు, బర్లు, చేపలు పంపిణీ చేస్తూ బీసీలను కులవృత్తులకు పరిమితం చేస్తున్నందుకా, టీఆర్‌ఎస్ విజయోత్సవాలు నిర్వహించేది ఎందుకని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వందలాది మంది విద్యార్థి అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ […]
క్రెడాయ్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. టీడీఆర్ బాండ్ల జారీ.. వాటి కాల పరిమితి.. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్ అమలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, ఆన్ లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వీటిపై స్పందించిన […]
భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటికి సంబంధించి జలమండలి భాగ్యనగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్‌సప్లై స్కీం(ఎండబ్యూ ఎస్‌ఎస్) ఫేజ్-2లో కలాబ్‌గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం […]
లఖింపూర్ ఖేరీ ఘటనలో యూపీ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు తెలిపారు. దీన్లో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్‌రామన్ కశ్యప్, మరో మృతుడు శ్యామ్ […]
ఏపీలో రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం నిధులను మంగళవారం జగన్ విడుదల చేశారు. వర్చువల్ పద్ధతిలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. మూడో ఏడాది రెండో విడత […]
రైతు తన నిర్ణయంతో పంటలు వేయకూడదా..? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా..? సిద్ధిపేట జిల్లా లో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తాడా..? ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కలెక్టర్‌పై ఫైర్ అయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ..అవగాహన లేని వెంకట్రామిరెడ్డి ని కలెక్టర్ గా ఇన్నాళ్లు గా ఎందుకు కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించారు. సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు జగ్గారెడ్డి. రైతులకు అండగా ఉంటాం. […]
హుజురాబాద్‌లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా మంగళవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ తరుణ్ చుగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీ ఈటల గెలిస్తే నియోజకవర్గానికి వచ్చే పనులను వివరించారు. తరుణ్ చుగ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం హుజురాబాద్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారన్నారు. ఈ ఎన్నికల్లో […]
టీఆర్ఎస్ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్‌ఎస్ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో […]
వైద్యులు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఈ దృశ్యం కన్పించింది. నిన్న ఆస్పత్రిలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి ఓ వైద్యురాలి తలకు గాయమైంది. దీంతో వైద్యులు ఈ రోజు హెల్మెట్లు ధరించి ఆస్పత్రిలో విధులకు వచ్చారు. ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్ ఫ్యాన్లను చూసి భయపడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడా ఏ ఫ్యాన్ ఊడి మీద పడుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు రక్షణ లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని, […]