రాష్ట్రంలో కొత్తగా 24 గంటల్లో 38,373 నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా మరో 171 కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,71,000లకు చేరుకుంది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,952కు చేరింది. మహామ్మారి నుంచి నిన్న 208 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,126 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరింది. వచ్చే […]
దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసిపుచ్చింది హైకోర్టు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది. 2019, నవంబర్ 27న […]
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 35, అసలంక35, భానుక రాజపక్సే 33 రాణించారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్, కమిన్స్, జంపా రెండేసీ వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా గెలవాలంటే 155 పరుగులు చేయాల్సి ఉంది.
తెలంగాణలో రాజకీయ మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ట్వీట్ల వార్ ప్రారంభించారు. కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”ప్రతిపాదన తేవడం…కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…!అంటూ రేవంత్ రెడ్డి ఘాటైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. ఈ […]
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వైసీపీ- టీడీపీ నేతల మధ్య విమర్శల మాటల దాడి, ప్రతి దాడులు కొనసాగుతుంటే దీనికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలిచేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆ పార్టీ బలంగా ఉన్న కోస్తా జిల్లాలో ఇక ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం 40-50 స్థానాల్లో సర్వే చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీడీపీతో జనసేన దోస్తీ కట్టనున్నట్లు వినికిడి. […]
చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఆయన ఆరోపణలు నిరాధారం అన్నారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ఏవోబీలో గంజాయి సాగు అందరికీ తెలిసిందేనని, పక్కా సమాచారం మేరకే ఏవోబీలో దాడులు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడిందని గంజాయి నివారణకు అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. పోలీసులకు రాజకీయాలతో ముడి పెట్టవద్దన్నారు.
ఈ రోజు ఉదయం విసిరిన రాజీనామా సవాల్ స్వీకరించకుండా 2 గంటలకే బీజేపీ నేతలు దీక్షశిబిరం వదిలిపోయిన నేపథ్యంలో ఈ సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. 2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాననిమోడీ అన్నారని దానికి తీసుకున్న చర్యలేవో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు చేసేదాన్ని దీక్ష అంటారా ? అని […]
బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చెరువులో నుంచి పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు రౌడీషీటర్ భరత్. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రౌడీ షీటర్ […]
ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై కెబినెట్లో ఎందుకు చర్చించ లేదు..? మాదకద్రవ్యాలు, గంజాయి ప్రస్తావన రాగానే దేశమంతా ఏపీ పేరే వినిపిస్తుంటే, కేబినేట్‌కు మాత్రం వినపడలేదన్నారు. ? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఎయిడెడ్ విద్యాసంస్థలపై మంత్రివర్గం ఎందుకు చర్చించలేదు..? విశాఖలో స్వామీజీ ఆశ్రమానికి రైతులభూములు తక్కువ ధరకు అప్పగించడానికే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిందా? […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మేయర్ ఎన్నికలు బీజేపీలో చిచ్చురేపాయి. కాకినాడలో ఇద్దరు బీజేపీ మహిళా కార్పోరేటర్ల సస్పెన్షన్ వేటు వేసింది. నూతన మేయర్ ఎన్నికలో వైసీపీకి మద్దతు తెలిపిన 5వ వార్డు కార్పొరేటర్ సుజాత, 41వ వార్డు కార్పొరేటర్ సత్యవతి. విప్ ధిక్కరించడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసింది బీజేపీ. తాము జారీచేసిన విప్ ధిక్కరించడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు […]