యాసంగి పంటను కొనే దమ్ము బీజేపీకి ఉందా ఉంటే ఎన్ని లక్షల టన్నుల కొంటారో తేల్చి చెప్పాలని, ఆ మాట చెప్పకుండా బీజేపీ డ్రామాలు ఆడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన లేఖ తమ దగ్గరుందని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత యుత ప్రభుత్వం అని అన్నారు. అన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందని దానిని మేము రాజకీయంగా వాడుకోలేదని మంత్రి తెలిపారు. ప్రజల […]
బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు. బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి […]
సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేవుళ్లతో సమానమని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు […]
ఏపీలో ఉప ఎన్నిక రాజకీయం రచ్చరచ్చగా మారింది. పోటీలో వున్న బీజేపీ అక్కడ ఎన్నికల తీరుపై ఈసీకి వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తూనే వుంది. తాజాగా బద్వేల్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు సోమువీర్రాజు. బద్వేల్ ఉపఎన్నికలలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఊరేగింపు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి, […]
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల రాక పెరిగింది. టీటీడీ ఏటా ప్రచురించే క్యాలెండర్లు, డైరీలకు మంచి డిమాండ్ వుంటుంది. తిరుమలతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని టీటీడీ దేవాలయాల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎంతో నాణ్యతతో మూర్తీభవించిన స్వామివారి క్యాలెండర్లను తమ ఇంటిలో, కార్యాలయాల్లో ఉంచుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు కేటుగాళ్ళు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్లో అధిక ధరలకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో టీటీడీ క్యాలండర్స్,డైరీల పేరుతో క్యాష్ చేసుకుంటున్న […]
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటుంది. తాజాగా ఈ రెండు పథకాల డబ్బుకు బదులు ల్యాప్‌టాప్ కావాలని ఆప్షన్ ఇచ్చారు విద్యార్థులు. ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారిలో 6.53 లక్షల మంది ఉన్నారు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు కాకుండా ల్యాప్‌టాప్‌లు కావాలని కోరిన విద్యార్థులకు వీటిని […]
పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మగ్గాల యజమానులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అనంతపురంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ దాడులు తూతూమంత్రంగా జరిగాయంటున్నారు. మగ్గాల యజమానులతో కుమ్మక్కై ఎలాంటి కేసు నమోదు చేయకుండా మూడురోజులపాటు విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఇలాంటి దాడులతో ఒరిగేదేం లేదంటున్నారు. మూడునాళ్ళ ముచ్చట అనే రీతిగా వ్యవహరించిన తీరు అనంతపురం జిల్లా హిందూపురం లో జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పవర్లూమ్స్ యూనిట్ల పై ఎన్ […]
విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు సినీనటుడు అక్కినేని నాగార్జున. జగన్‌తో భేటీలో ఏం మాట్లాడారోనని అంతటా ఉత్కంఠ రేగుతోంది. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు నాగార్జున. విజయవాడకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్ నా శ్రేయోభిలాషి. జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా రోజులవుతుంది. అందువల్ల విజయవాడ వచ్చాను. జగన్ తో కలిసి లంచ్ చేశాను. ఇది నా వ్యక్తిగత పర్యటన. […]
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇటు ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో కరోనా కొత్త రకం వేవ్ కలవరం కలిగిస్తోంది. బెంగళూరులో ఓ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్ధులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 భారత్‌ను కూడా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకూ డెల్టా AY.4.2 కేసులు ఏడు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు. ఓ రెసిడెన్షియల్ స్కూల్లో 32 కరోనా […]
పిల్లలకు భిన్నమైన పేర్లను పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొందరూ తల్లిదండ్రలు తమ పిల్లలకు విభిన్నమైన పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన బిడ్డకు వింతైన పేరు పెట్టాడు. ఆంగ్లంపై అభిమానంతో ఆల్ఫాబెట్‌లోని తొలి 11 అక్షరాలతో పేరు పెట్టేశాడు. ఆ అబ్బాయి పేరు ABCDEF GHIJK ZUZU. అక్కడి అధికారులు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆ స్కూల్‌కు వెళ్లడంతో 12 ఏళ్ల ఈ బాలుడి పేరును చూసి షాక్ […]