బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చెరువులో నుంచి పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు రౌడీషీటర్ భరత్.
తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రౌడీ షీటర్ భరత్ పోలీసులపై మండిపడ్డాడు. నా చేతిలో కత్తి, బ్లేడు వుంది.. నన్ను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేశాడు. భరత్ పై గతంలో అనేక కేసులు వున్నాయి. గంజాయి తాగి రోడ్డుపై భయాందోళనలు కలిగించాడు.
గతంలోనూ పట్టుకునేందుకు వెళ్ళగా కాల్వలోకి దూకి ఈవిధంగానే హంగామా కలిగించాడు. బయటకు వచ్చి 15 రోజులు కాలేదు. మళ్ళీ నా మీద కేసులు వున్నాయని పోలీసులు వేధిస్తున్నారు. ఆ కేసులకి, నాకు ఎటువంటి సంబంధంలేదు. దొంగతనం జరిగినప్పుడు నేను అమరావతిలో వున్నా. చెరువునుంచి పోలీసులు వెళ్ళిపోవడంతో అక్కడినించి పారిపోయాడు భరత్. ఈ ఉదంతం గుంటూరులో సంచలనం రేపింది