ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వైసీపీ- టీడీపీ నేతల మధ్య విమర్శల మాటల దాడి, ప్రతి దాడులు కొనసాగుతుంటే దీనికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలిచేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆ పార్టీ బలంగా ఉన్న కోస్తా జిల్లాలో ఇక ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కనీసం 40-50 స్థానాల్లో సర్వే చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీడీపీతో జనసేన దోస్తీ కట్టనున్నట్లు వినికిడి. టీడీపీ కూడా జనసేనకు అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.