నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం మరో 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ […]
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు దని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు వ్యయంపై విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారని మండిపడ్డారు. ఈ విధంగా రెండు వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం […]
వైన్ ఎంత కాలం నిల్వ ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పాతకాలం నాటి వైన్ బాటిల్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. స్పెయిన్‌లో ఆర్టియో రెస్తారెంట్ వైన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పాతకాలం నాటి వైన్ దొరుకుతుంటుంది. ఈ రెస్టారెంట్‌లో వైన్ సేవించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, బుధవారం రోజున ఓ జంట వైన్ కోసం రెస్టారెంట్‌కు వచ్చింది. కావాల్సిన వైన్ కొనుగోలు చేయడమే కాకుండా అక్కడి […]
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కళ్యాణకట్ట సిబ్బంది తీరు విమర్శలకు కారణం అవుతోంది. ఆలయం కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు. అక్కడ చేతివాటం చూపించారు 12 మంది క్షురకులు. దేవస్థానం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పరిశీలించిన ఈవో లవన్న ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. చేతివాటానికి పాల్పడిన 12 మంది క్షురకులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల […]
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లింగంపేట వాంబే గృహాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని బత్తిన నగర్ కు చెందిన మువ్వల దుర్గా ప్రసాద్ గా గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్నారు. దుర్గా ప్రసాద్ ను కత్తితో నరికి చంపి పరారయ్యారు దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు త్రీటౌన్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు […]
మందు, సిగరేట్ కు అలవాటు పడిన వ్యక్తులు దాని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. ఒకసారి అలవాటు పడ్డారంటే క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ వ్యసనాలు తప్పుడు మార్గంలో నడిపించేలా చేస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు మావల్ల కాదులే అని చెప్పి మళ్లీ ఆ వ్యసనాలకు బానిసలవుతుంటారు. అలాంటి వారు ఓ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అయితే తప్పకుండా ఈ […]
పువ్వులను ఇష్టపడని మహిళలు ఉండరు. ఎన్నో రకాల పువ్వులు నిత్యం మనకు మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు చాలా మంది హోమ్ గార్డెనింగ్ పేరుతో పూల మొక్కలను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అయితే, బ్రహ్మకమలం, రఫ్లీషియా వంటి పువ్వులు అరుదుగా పూస్తుంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వులు పూస్తుంటాయి. పెనిస్ ప్లాంట్ల్ లేదా కార్ప్స్ ప్లవర్ అనే పుప్వు చాలా అంటే చాలా అరుదుగా మాత్రమూ పూస్తుంది. చరిత్రలో ఇప్పటి వరకు కేవలం మూడుసార్లు మాత్రమే పూసినట్టు చరిత్ర […]
డాక్టర్లు తరచూ సీజనల్ ఫలాలు తినాలని అంటుంటారు. వానాకాలంలో కమలాలతో పాటు లభించేవి సీతాఫలాలు. ఇవి మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. దీనిలో శరీరంలో వుండే విష వ్యర్థాల్ని బయటకి పంపే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకు ఎంతో మేలు చేసే విటమిన్ సీ విటమిన్ కూడా వుంటుంది. దీంతో పాటుమెగ్నీషియం, పొటాషియం వంటివి మన గుండె ను కాపాడతాయి. అందువల్లే సీతాఫలాలకు అంత డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే ఇప్పుడు పెద్ద సైజ్‌లో […]
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్‌ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను […]
క్రిస్మస్ వేడకులకు గిఫ్ట్‌లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక క్రిస్మస్ వేడుకలకు ముందు నుంచే వివిధ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ముందే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి పండుగలకు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. బ్రిటన్‌కు చెందిన డెబ్రా కాంగ్నమ్ అనే మహిళ ఇటీవలే శాంసంగ్ టీవీని 280 పౌండ్లకు కొనుగోలు చేసింది. క్రిస్మస్ కానుకగా తన కూతురుకి ఇవ్వాలని అనుకున్నది. వచ్చిన పార్శిల్‌ను అలానే ఉంచేసింది. వారం తరువాత ఇంట్లో పెంచుకునే చిన్న కుక్కపిల్ల పదేపదే పార్శిల్ వద్దకు వెళ్లి వాసన […]