అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విచిత్రంగా జరుగుతుంటాయి. నెట్టింట సందడి చేస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా సీసీటీవీల ద్వారా చూసి అసలు విషయాలు కనిపెడుతుంటారు. కొన్నిసార్లు సీసీ కెమెరా ఉన్నది అని తెలుసుకోకుండా చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ చిన్న సంఘటన కూడా ఒకటి. బ్రెజిల్ అంటేనే అమెజాన్ అడవులకు, వేలాది పక్షులు, వన్యమృగాలకు ప్రసిద్ది.
Read: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
అలాంటి పచ్చని బ్రెజిల్ లోని పరానా రాష్ట్రంలో క్యురిటిబా అనే నగరం ఉన్నది. అ నగరంలో ట్రాఫిక్‌ను పరిశీలించేందుకు ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాలు అమర్చారు. అయితే, సడెన్ ఓ సీసీ టీవీ కెమెరా ముందు ఓ చిలుక ప్రత్యక్షం అయింది. కెమెరా లెన్స్ పనిచేస్తున్నాయా లేదా అన్నట్టుగా కాసేపు పరిశీలించింది. అనంతరం దాని తోవన అది ఎగురుకుంటూ వెళ్లిపోయింది. కొన్ని సెకన్ల ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.