ఆఫ్ఘన్‌లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నారు. ఆ తరువాత అక్కడ కరోనా మహమ్మారి ఎలా వ్యాపిస్తున్నదో, కేసులు ఎమయ్యాయో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ ఆరోగ్యసంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్‌లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
Read: స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్: వాయిదాల్లో చెల్లించండి…
ఆఫ్ఘన్‌లోని 3 మిలియన్ మంది పిల్లలకు పోలియో వ్యాక్సిన్‌ను అందించబోతున్నారు. తాలిబన్లు ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ, యూనిసెఫ్‌కు సహకరించేందుకు ముందుకు రావడం విశేషం. మొదటగా కాబూల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధం అవుతున్నారు.