కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం డీకె అరుణ ప్రెస్ మీట్‌పెట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజమెత్తారు. హుజురాబాద్ బీజేపీ గెలుపు దుబాయ్ శేఖర్‌కు సెగ తగిలించిందన్నారు. హుజురాబాద్ ఎన్నికతో కేసీఆర్‌కు కళ్లు తెరిపించాయన్నారు. ఆ రిజల్ట్ చూసి ఆయన దిమ్మ తిరిగిందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్నారు. 12 వందల మందిని చంపి… ఈ రోజు సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి గెలుపులు సహజం అని ఇప్పుడు అంటున్నారు.. ఆయనకు ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుందన్నారు. హుజూరాబాద్‌లో అన్ని […]
కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచే వెళ్తాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రం చీకటి పాలనను చూసిందన్నారు. బండ మా మీద వేయటానికి ప్రయత్నించటం మాకే మంచిది అయిందని ఆయన అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పే అవకాశం వచ్చిందన్నారు. కేంద్రం పెట్రోల్ పై 3.౩5 లక్షల కోట్లు వసూలు చేసింది. వీటిలో రాష్ట్రాలకు పంచింది కేవలం రూ.19,475 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. సర్ ఛార్జీలు, సెస్సుల రూపంలో […]
భారీ వర్షాలతో తమిళనాడు ఇప్పటికే తడిసి ముద్దవుతుంది. ఆ రాష్ట్ర సీఎం కూడా తమిళనాడుకు ఎవ్వరూ రావొద్దని సూచించారు. తాజాగా తమిళనాడుకు మరో భారీ వర్ష ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే చెన్నైలో 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని, నవంబర్ 10, 11 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్రవాతావరణ శాఖ డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగా ళ ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిం దన్నారు. ఇది […]
కరోనా మహమ్మారి తరువాత దేశీయ విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోంది. దేశీయ విమానాలు 100శాతం సీటింగ్‌తో ప్రయాణాలు సాగిస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణాలు సాగించేందుకు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నా, నిబంధనలు అమలు చేస్తున్నారు. విమాన ప్రయాణికులను పెంచుకునే క్రమంలో కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. Read: ఆ గ్రామంలో దీపావళి ఎలా జరుపుకుంటారో తెలిస్తే షాక్ […]
ఇటీవలే దీపావళి వేడుకలు ముగిశాయి. దీపావళి అంటే దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. దీపావళి వేడుకలను దక్షిణ భారతదేశంలో మూడు రోజులు నిర్వహిస్తే, ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేడుకలు చాలా విచిత్రంగా జరుగుతాయి. కర్ణాటక- తమిళనాడు బోర్డర్లో గమటిపురా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో దీపావళి వేడుకలను చాలా విచిత్రంగా జరుపుకుంటారు. దీపావళి రోజున అందరిలాగే దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు. అయితే, దీపావళి ముగింపు వేడుకలను […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డీలిట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు సీబీఐ అధికారులు అమెరికా సాయాన్ని కోరనున్నారు. యుఎస్‌లోని సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోసం ఎదు రు చూస్తున్నట్టు కొందరూ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత డజన్ల కొద్దీ వ్యక్తులను ప్రశ్నించింది, వరుసగా ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ (సీబీఐ). ఇప్పటికే సీబీఐ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (MLAT) […]
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే కనీసం రూ.50 అవుతుంది. సరే ఇంట్లో వండుకుందామని అనుకున్నా ఒక్కొక్కరికి కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుంది. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో బ్రేక్‌ఫాస్ట్ నుంచి భోజనం వరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఆ హోటల్లో ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నా రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, పూరీ, వడ, ఉగ్గాని ఇలా ఏది తీసుకున్నా […]
గంజాయి అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. ఏఆర్ గ్రౌండ్లో జరిగిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కమిషనరేట్ పరిధిలో గంజాయి సేవిస్తున్న, సరఫరా చేస్తు న్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి సేవిం డచడం వలన జరిగే అనర్థాలన ఆయన వివరించారు. బెజవాడలో గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో వంద ల సంఖ్యలో యువకులు, విద్యార్థులకు కౌన్సిలింగ్ […]
సీఎం కేసీఆర్ మరోసారి మీడియాముందుకు వచ్చారు. ఈ సం దర్భంగా సీఎం మాట్లాడుతూ…. దళిత సీఎంను చేయలేదని దానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. షబ్బీర్ అలీ కూడా ఈ విషయం చెప్పారు. నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు. రెండోసారి 83 సీట్ల లో మళ్లీ గెలిపించారు. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 78 వేల ఉద్యోగాలు ఇస్తాం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం జోనల్ ఆమో దం విషయంలో కొర్రీలు పెడుతుంది. జోనల్ ఆమోదం […]
ప్రపంచ వాతావరణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు ఇబ్బడిముబ్బడిగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వేడి పెరిగిపోయింది. ఈ వేడి కారణంగా దృవాల వద్ద మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా నదుల్లో, సముద్రాల్లో నీటిమట్టం పెరిగిపోతున్నది. నీటిమట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇబ్బందులు ఎదర్కొననున్నాయి. 2030 నాటికి సముద్రాల్లోని నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి మట్టం పెరిగితే అనేక నరగాలు […]