నిర్మల్ జిల్లాలో సర్కారీ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. భైంసా ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కుభీర్ మండలం బెల్లామ్ తండా కు చెందిన రేఖ అనే మహిళ ఆదివారం ఆస్పత్రికి వచ్చింది.
ఆమె మధ్యాహ్నం 3 గంటలకు డెలివరీకి రాగా అర్ధ రాత్రి నార్మల్ డెలివరీ అయింది. అనంతరం డాక్టర్లు, సిబ్బంది వెళ్ళిపోయారు. మగ బిడ్డ కు జన్మ నిచ్చిన రేఖ అనారోగ్యంతో కన్నుమూసింది. తల్లి మరణంతో ఆ శిశువు అనాథ అయింది. డాక్టర్ల తీరుపై బాలింత బంధువులు ఆందోళనకు దిగారు.