తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
“దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి, గ్రామగ్రామానికి ప్రజల వద్దకు తీసుకు వెళతామన్నారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ఉప ఎన్నికలు, బీజేపీ విజయం, పార్టీ పటిష్టతపై అగ్రనేతలు చర్చించారన్నారు.