ఈ నెల 12 నుంచి 22 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వేలాదిమంది భక్తులు స్టేడియానికి తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి భక్తి టీవీ కోటిదీపోత్సవం నేడు 9వ రోజుకు చేరుకుంది. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం భక్తులకు శ్రవణానందాన్ని కలిగించింది. వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి […]
అమరావతిని ఏకైక రాజధానిగా వుంచాలంటూ రైతులు, ప్రజాసంఘాలు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయించారు. రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతామని ఏపీ బీజేపీ అగ్ర నేతలు ప్రకటించారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రాజధాని రైతుల […]
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు కెఎస్.జవహర్ రెడ్డి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా.జవహర్ రెడ్డిని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఈరోజు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ రెడ్డి. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై దేవదాయ శాఖలో ఉన్న ఆయన్ను వెనక్కు తీసుకుని జలవనరుల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. అయితే ఈవో స్థానంలో మరొకరిని నియమించేవరకూ […]
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో […]
భారీవర్షా ల కారణంగా నెల్లూరు జిల్లా వాసులు కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. పెన్నానదికి వరద ఉధృతి అధికంగా ఉంది. పొర్లుకట్టలు ఎక్కడికక్కడే తెగిపోతున్నాయి. వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. దాదాపు 30 గ్రామాలు నీట మునిగాయి. నెల్లూరులోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. భగత్ సింగ్ కాలనీ, జనార్ధన్ రెడ్డి కాలనీ, జయలలిలతా నగర్, పొర్లుకట్ట, ఈద్గా కాలనీ, శివగిరి కాలనీ, మన్సూర్ నగర్, మనుమసిద్ది నగర్, పుట్టా ఎస్టేట్, తల్పగిరికాలనీలు నీట మునిగాయి. వర్షాల వల్ల […]
ఏపీలో భారీ వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ లో గత రెండురోజులుగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యం. ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. చిన్న చిన్న పనులు, పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్ ల గేటు మరమ్మత్తు పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా? అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప […]
ఏపీ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలతో పాటు నందమూరి కుటుంబానికి చెందిన కల్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యబాబు, నందమూరి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. మా కుటుంబాన్ని అంటే ఊరుకునేది లేదన్నారు. వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు నందమూరి రామకృష్ణ. ఈ వివాదంపై కుటుంబ సభ్యులు అంతా కలిసి మాట్లాడాడమన్నారు. దిగజారి మాట్లాడితే సహించేది లేదన్నారు. మా కుటుంబంలోని […]
కడప, తిరుపతి వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు సీఎం. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి. హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన […]
మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థి విజయ్ భాస్కర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విద్యార్ధి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తోంది జేబీఐటీ కాలేజ్ యాజమాన్యం. జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ 2వ ఏడాది చదువుతున్నాడు విజయ్ భాస్కర్. హాస్టల్ గది […]
భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని ఊర్లన్నీ చెరువుల్లా మారాయి. తిరుపతిలో గ్రామాల మధ్య వివాదంగా మారింది రాయలచెరువు. గండి కొట్టాలని ఒకవైపు గ్రామస్థులు….గండి కొట్టకూడదని మరో వైపు గ్రామస్థులు అంటున్నారు. చెరువుకు అవుట్ ప్లో కంటే ఇన్ ప్లో ఎక్కువగా వుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి, తమను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురి కావడంతో […]