2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో అందరూ గ్రాండ్ పార్టీలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సోషల్ మీడియా రీల్స్ నుంచి యూట్యూబ్ వరకు రికార్డులు సృష్టించిన పాటలు మీ పార్టీలో డీజే బాక్సులను షేక్ చేయలనుకుంటున్నారా.. అయితే 2025లో ఊపు ఊపిన పాటలు మీకోసం. ముందుగా వాటిలో మొదటిది ‘సైయారా’ టైటిల్ సాంగ్. బాలీవుడ్ నుంచి గ్లోబల్ లెవల్‌లో హిట్ అయిన ఈ సాంగ్.. స్పాటిఫై టాప్ 50లో చోటు దక్కించుకుని 59 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక మన తెలుగు మాస్ బీట్ ‘రాను బొంబాయికి రాను’ గురించి చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ ఫేమ్ రాము రాథోడ్ పాడిన ఈ ఫోక్ సాంగ్ ప్రతి ఫంక్షన్‌లోనూ తప్పనిసరిగా మారింది. అలాగే
Also Read : Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?
మరాఠీ నుంచి వచ్చిన ‘షేకీ’ సాంగ్ తన అఫ్రో బీట్స్‌తో రీల్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. సంజు రాథోడ్ పాడిన ఈ పాటలోని హుక్ స్టెప్ ఇప్పుడు యూత్ ఫేవరెట్. అలాగే హరియాణా జానపద గీతం ‘తేరి రంజోలీ బొలేగీ’ కూడా ఈ ఏడాది పార్టీ బీట్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కేవలం మాస్ సాంగ్స్ మాత్రమే కాదు, మెలోడీ ఇష్టపడే వారి కోసం ‘దో పత్తి’ సినిమాలోని ‘రాంఝా’ సాంగ్ మనసును తాకుతోంది. 45 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట పార్టీలో ఒక మంచి ట్రాన్స్‌ను ఇస్తుంది. సో, ఇంకెందుకు ఆలస్యం.. ఈ హిట్ సాంగ్స్‌తో మీ 2026 వెల్‌కమ్ పార్టీని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకోండి!