భారీవర్షాలు, వరదలతో తిరుపతిలోని రాయల చెరువు డేంజరస్‌గా మారింది. చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరదనీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టితో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు సమీప ప్రజలు. రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం వుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటేశ్వరపురం, […]
పెళ్ళంటే సందడే వేరు. పెళ్ళికి సర్వం సిద్ధం అయింది. కానీ భారీ వర్షం పెళ్ళింట్లో విషాదం నెలకొంది. కడప జిల్లా రాజంపేటలో వర్షం బీభత్సం కలిగించింది. ఈ వరద పెళ్ళి ఇంట్లో విషాదం నింపింది. పెళ్ళి ఆగిపోయింది. రాజంపేట రామచంద్రాపురంలో చెయ్యేరు వరద నీటిలో కొట్టుకుపోయింది 75 ఏళ్ళ సావిత్రమ్మ. దీంతో మనవడి పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోయింది. రాజంపేటలో ఇవాళ అమరనాథ్ అనే యువకుని పెళ్ళి జరగాల్సి వుంది. వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 30 […]
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి ఎన్నికలు ముగిసినా ఇంకా ఉత్కంఠ తీరడంలేదు. దర్శి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యతను కనబరిచిన టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంటుందా? టీడీపీ కౌన్సిలర్స్ లో చీలిక కు వైసీపీ ప్రయత్నం చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. చైర్మన్ ఎన్నిక జరగబోయే సోమవారం ఏం జరగబోతోంది? రెండుదఫాలుగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తాడిపత్రి, కొండపల్లి, దర్శిలో ఆధిక్యతను సాధించింది. దర్శిలో మొత్తం 20 […]
భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం […]
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మణప్పురం గోల్డ్ లోన్ లో చేతివాటం ప్రదర్శించి 14 లక్షలు కాజేశాడో మేనేజర్. బంగారం తమకు అక్కరకు వస్తుందని మణప్పురంలో తనఖా పెట్టారు ఖాతాదారులు. అక్కడ పనిచేసే మేనేజర్ జోసఫ్ రాజ్ మోసానికి పాల్పడ్డాడు. శఠగోపంపెట్టి ఖాతాదారులకు చెందిన 14 లక్షల మేర బంగారం నగలు ఎక్కువ మొత్తంలో లోన్‌గా తీసుకుని మోసం చేశాడు మేనేజర్ జోసఫ్ రాజ్. […]
సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్యకేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. సత్యంబాబు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల తీరుపై సత్యంబాబు లేఖ రాశారు. జైభీమ్ సినిమాలో గిరిజనులకు అన్యాయం జరిగినట్టే తనకు జరిగిందని లేఖలో సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని వాపోయారు. నష్ట పరిహారం ఇవ్వాలని […]
వరుసకు బాబాయ్.. తండ్రి తర్వాత తండ్రిలా కాపాడాల్సిన వాడు. కానీ పసిపిల్లాడిని కిరాతకంగా చంపేశాడు. మైలార్ దేవ్ పల్లి లో నాలుగు సంవత్సరాల బాలుడు లక్ష్మీ నరసింహను హత మార్చిన కసాయి బాబాయి వీరేశంను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. హంతకుడు బాలుడి తల్లి మహేశ్వరి చెల్లి భర్త. స్వయానా మరిది కావడం గమనించాల్సిన విషయం. గత కొన్ని రోజులుగా బాలుడు తల్లి మహేశ్వరి చెల్లిని వేధిస్తున్నాడు మరిది వీరేశం. భర్త వేధింపులు భరించలేక తనకు విడాకులు కావాలంటూ […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ […]
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. ఔటర్ రింగురోడ్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. తాజాగా ఓ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఆగి వున్న లారీని ఢీ కొంది ఓట్రక్. దీంతో ట్రక్ నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్ లో ఇరుక్కుపోయిన క్లీనర్, తనను కాపాడాలంటూ అరుపులు కేకలు వేశాడు. 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వాహనదారులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక […]
భారీవర్షాలు కడప జిల్లాలో పురాతన బ్రిడ్జిల పాలిట శాపంగా మారాయి. వరదకు కుంగిపోయింది కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి. ఏ క్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా వుంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి శ్లాబ్ క్రమ క్రమంగా దిగువకు కుంగిపోయిందని పోలీసులు, రెవిన్యూ అధికారులు తెలిపారు. ఏ క్షణంలో నైనా కమాలపురం బ్రిడ్జి కుప్పకూలే ప్రమాదం ఉందని డి.ఎస్.పి వెంకట శివారెడ్డి తెలిపారు. బ్రిడ్జి ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి నేషనల్ హై వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు పోలీసులు. యుద్ధప్రాతిపదికన […]