భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని ఊర్లన్నీ చెరువుల్లా మారాయి. తిరుపతిలో గ్రామాల మధ్య వివాదంగా మారింది రాయలచెరువు. గండి కొట్టాలని ఒకవైపు గ్రామస్థులు….గండి కొట్టకూడదని మరో వైపు గ్రామస్థులు అంటున్నారు. చెరువుకు అవుట్ ప్లో కంటే ఇన్ ప్లో ఎక్కువగా వుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి, తమను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురి కావడంతో గ్రామాలు ముంపునకు గురైవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా 7 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. తమ గ్రామాల వైపు అధికారులు కన్నెత్తి చూడడంలేదని మండిపడుతున్నారు.
కుప్పం బాదురు మార్గంలో ఉన్న రాయలచెరువు మొరవను ఆక్రమణలను అధికారులు తొలగించినప్పటికీ చెరువు లోని వరద నీరు తక్కువ మొత్తంలో మొరవ ద్వారా వెళుతున్నాయి. దీంతో రాయల చెరువు కట్ట కింద ఉన్న గ్రామాల ప్రజలు ఎక్కడ రాయలచెరువు తెగిపోతుందా అనే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురవుతున్నారు. దీంతో స్థానిక ఎస్‌ఐ డి.వై స్వామి, మండల స్థాయి అధికారులు ప్రజలెవర్నీ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.