ఏపీ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలతో పాటు నందమూరి కుటుంబానికి చెందిన కల్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యబాబు, నందమూరి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. మా కుటుంబాన్ని అంటే ఊరుకునేది లేదన్నారు. వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు నందమూరి రామకృష్ణ.
ఈ వివాదంపై కుటుంబ సభ్యులు అంతా కలిసి మాట్లాడాడమన్నారు. దిగజారి మాట్లాడితే సహించేది లేదన్నారు. మా కుటుంబంలోని మహిళలపై ఎవరు ఏం మాట్లాడినా తగిన శాస్తి జరగదన్నారు. అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ.. అంతా మా సహనం నశించేలా మాట్లాడారన్నారు. ఏ కుటుంబంపై ఇలాంటివి జరగకూడదన్నారు. క్రమశిక్షణ పక్కన పెట్టి బయటకు వస్తామన్నారు.