టీఆర్ఎస్ నేత బండ ప్రకాష్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు బండప్రకాశ్. ఎంఏ, పీహెచ్డీ చేశారు ప్రకాష్. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి 1996లో పి.హెచ్.డి పట్టా పొందారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెడుతూనే ఉన్నది. తగ్గినట్టే తగ్గి తిరిగి వివిధ వేరియంట్ల రూపంలో విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడటంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ ఉన్నట్టుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ దృవీకరించింది. అయితే, కరోనా మహమ్మారి యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. Read: మహారాష్ట్రలో కొత్త రూల్స్: ఆ దేశాల నుంచి వచ్చే వారికి… రోజువారి కేసులు భారీ […]
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై సీబీఐ కేసులు నమోదుచేసింది. నంది గ్రెయిన్ డెరివేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్ శాస్త్రి, సజ్జల శ్రీధర్ రెడ్డి, శశిరెడ్డి పై కేసు నమోదయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసింది సీబీఐ, తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేశారని బీఓబీ ఫిర్యాదు చేసింది. ఎస్పీవై రెడ్డి సహా పలువురు మోసం చేశారని సీబీఐకి ఫిర్యాదు చేసింది. రూ.61.86 కోట్ల నష్టం […]
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో తెలంగాణ రైతుల సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడుతుంటే… రెండు సభలోని చర్చ జరగాలని ప్రతిపాదించినా కేంద్రం స్పందించడం లేదన్నారు. తప్పుడు సమాచారం ఇస్తూ తెలంగాణ రైంతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు. ఇది తెలంగాణ రాష్ర్ట సమస్య, రైతుల గురించి పోరాడుతున్న మాపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. లోక్‌సభ, రాజ్యాసభలో నిరసన తెలిపామన్నారు. కేంద్రం మీద బియ్యం కొనాల్సిన బాధ్యత ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. […]
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 20కిపైగా దేశాల్లో విస్తరించింది. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కావడంతో వేరియంట్‌పై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. కేంద్రం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేస్తున్నారు. వారిని పరీక్షలు పూర్తయ్యి, రిపోర్ట్ వచ్చే వరకు ఎయిర్ పోర్టులోనే వేచి చూడాల్సి ఉంది. అయితే , […]
వీఐపీలను నిలువునా ముంచేసిన శిల్ప చౌదరి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. శిల్ప ఆమె భర్త శ్రీనివాస్ పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నటుడు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, రోహిణి రెడ్డి. 2 కోట్ల 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులు శిల్ప, శ్రీనివాస్ లు ఇద్దరిపై కోర్ట్ లో పీటీ వారెంట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. […]
గుజరాత్లో కడలి కల్లోలం సృష్టించింది. దీంతో 12 మత్స్యకారుల బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. 12 బోట్లలో మొత్తం 23 మంది మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని సురక్షితంగా కాపాడు. మిగతా 12 మంది మత్స్యకారుల కోసం అధికారులు గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి వాతారవణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ, అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. Read: ఇలాంటి పెళ్లి పత్రికను ఎక్కడా […]
ఏపీ ప్రజల పాలిట వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్. రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించేందుకు తీవ్ర కాలయాపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు […]
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్‌చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు మోడీ, మమత ఒక్కటయ్యారని ఆరోపించారు. దేశంలో అసలు యూపీఏ లేదని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. దీదీ, బీజేపీ సంబంధాలు పాతవేనని… తనతో పాటు, పార్టీని, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందు మోడీతో మమత లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు మార్లు దీదీ మోడీ […]
ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుభూతి కోసం చేతులు అడ్డుపెట్టుకుని ఏడ్చారన్నారు సామినేని ఉదయభాను. ఆనాడు శాసనసభలో భువనేశ్వరి గురించి ఏమీ మాట్లాడలేదని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఏమి జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎంతో ధైర్యంగా ఉండాలి. చంద్రబాబులా ఇప్పటివరకూ […]