జీవితంలో పెళ్లి అన్నది ఒక మధురానుభూతి. పెళ్లిని వెరైటీగా చేసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. పెళ్లి పనుల నుంచి పెళ్లి పత్రిక వరకు వైవిధ్యం కనబరచాలని చాలా మందికి ఉంటుంది. అయితే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లో పనిచేసే డాక్టర్ సందేశ్ తన పెళ్లి పత్రికను కూడా తన స్టాక్ మార్కెట్ భాషలో అచ్చువేయించాడు. పెళ్లి పత్రికలో వాడిన పదాలన్నీ స్టాక్ మార్కెట్లో నిత్యం వినే పదాలకు అన్వయించారు. వివాహ పత్రిక ఆహ్వానాన్ని ఐపీఓ గా పేర్కొన్నారు. […]
తుఫాన్ హెచ్చరికలతో అప్రమత్తం అయింది విశాఖ పోలీసు శాఖ. నగర ప్రజలు,వాహనదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు సిటీ పోలీసులు. రేపటి నుంచి ఆదివారం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగిపడ్డం, రహదారులు జలమయం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. రవాణాకు అడ్డంకులు ఏర్పడతాయి కనుక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప తుఫాన్ సమయంలో రోడ్లపైకి రావద్దని కోరింది. రాబోయే తుఫాన్ కి సంబంధించి విశాఖ […]
దేశ రాజధానిలో కాలుష్యాన్ని 24 గంటల్లోగా అరికట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సూచించకపోతే.. కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము మీకు 24 గంటలు ఇస్తున్నాము. మీరు దీనిని తీవ్రంగా పరిశీలించి, సీరియస్‌గా పరిష్కారం చూపాలని […]
ఏపీలో తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండముగా […]
ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో రారాజుగా వెలుగుతున్నారు. లక్షకోట్ల కంపెనీగా టెస్లా ఎదిగింది. అంతేకాదు, స్పెస్ ఎక్స్‌ను స్థాపించి అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఎలన్ మస్క్ అటు వివాదాలు సృష్టించడంలో కూడా అందరికంటే ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. ట్విట్టర్ కొత్త సీఈవో పరాగ్‌ను స్టాలిన్‌తో పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రష్యాచరిత్రలో అప్పటి అధ్యక్షుడు స్టాలిన్, అతని అంతరంగికుడు నికోలయ్ యెజోవ్ కు మధ్య మంచి స్నేహం […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదం పొంచియున్న నేపథ్యంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. Read: వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్… గుజరాత్ లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వినూత్నంగా […]
మధిర టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు ఇటీవలే కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. కౌన్సిలర్ మల్లాది వాసు వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్న సామాజిక వర్గాన్ని కుట్రలు, కుతంత్రాల వైపు చంద్రబాబు నడిపిస్తున్నారు. Read: 2021 బెస్ట్ యాప్‌లు ఇవే… మల్లాది వాసు లాంటి వారిని వివిధ పార్టీల్లో […]
గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రతిరోజూ కొన్ని వందల కొత్త యాప్‌లు రిజిస్టర్ అవుతుంటాయి. అందులో కొన్ని యాప్‌లు వినియోగించుకోవడానికి, డైలీ లైఫ్ లో వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కొన్ని యాప్‌లు ఎంటర్టైన్మెంట్ కోసం, కొన్ని యాప్‌లు సరదాగా గేమ్‌లు వంటివి ఆడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ప్రతీ ఏడాది గూగుల్ ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్స్ ఏమున్నాయి అనే దానిపై సర్వేను నిర్వహిస్తుంది. యూజర్ సర్వే ఆధారంగా బెస్ట్ యాప్స్ ఏంటో ప్రకటించి వాటికి అవార్డులు అందజేస్తుంటుంది. 2021 యూజర్ […]
కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ భయాందోళనలు కలిగేలా చేస్తే, డెల్టా నుంచి బయటపడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. డెల్టా కంటే ఒమిక్రాన్ 6 రెట్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్‌ను మొదట సౌతాఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత ఆ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పుడు సౌతాఫ్రికాలో బయటపడుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ భాగం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జోహెన్స్‌బర్గ్‌లో నమోదవుతున్న కోత్త […]