ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుభూతి కోసం చేతులు అడ్డుపెట్టుకుని ఏడ్చారన్నారు సామినేని ఉదయభాను. ఆనాడు శాసనసభలో భువనేశ్వరి గురించి ఏమీ మాట్లాడలేదని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. శాసనసభలో ఏమి జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎంతో ధైర్యంగా ఉండాలి. చంద్రబాబులా ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడు ఏడవలేదన్నారు. మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు వైసీపీ నాయకులపై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తాం అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించారు. వాసుపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కౌన్సిలర్ మల్లాది వాసు వైసీపీ నేతలపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదన్నారు. మల్లాది వాసు పై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.