ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 20కిపైగా దేశాల్లో విస్తరించింది. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కావడంతో వేరియంట్‌పై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. కేంద్రం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేస్తున్నారు. వారిని పరీక్షలు పూర్తయ్యి, రిపోర్ట్ వచ్చే వరకు ఎయిర్ పోర్టులోనే వేచి చూడాల్సి ఉంది. అయితే , మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన రూల్స్ తోపాటుగా మరికొన్ని కఠినమైన రూల్స్‌ను తీసుకొచ్చింది.
Read: గుజరాత్‌లో కడలి కల్లోలం… మునిగిపోయిన 12 బోట్లు…
ఎట్ రిస్క్ నుంచి అల్ట్రా ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వేరు చేసి వారిని నేరుగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు తరలిస్తారు. పరీక్షలు నిర్వహించిన తరువాత నెటిగివ్ గా తేలితే వారం రోజుల తరువాత హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తరువాత వచ్చిన మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే బయటకు రావాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, నమీబియా, లసోంతో, జింబాబ్వే, ఎస్వాతిని దేశాలను అల్ట్రా ఎట్ రిస్క్ దేశాల జాబితాలో చేర్చింది మహాప్రభుత్వం. అన్ని రాష్ట్రాల కంటే ఎఫెక్ట్ ఎక్కువగా మహారాష్ట్రపైనే ఉంటుందని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒమిక్రాన్‌ను ఎదుర్కొనడానికి సిద్ధమవుతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.