నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. సింహ, లెజెండ్ చిత్రాల తరువాత వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అంచనాలను మించి నేడు విడుదలైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని కలక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇక అఖండ భారీ విజయాన్ని అటు అభిమానులే కాకుండా ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి […]
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కడియం శ్రీహరి మాటల దాడులను పెంచారు. ఆయన ఏకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలను బేవకూఫ్‌లు అని సంబోధించారు. బీజేపీ రైతులపై చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దమ్ము లేదని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే రైతులను అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. పనిచేసే వారిని చేయనివ్వరు వారు […]
అదృష్టం ఎవర్ని ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కరోనా సమయంలో బయటకు వెళ్లి కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడంలేదన్నది వాస్తవం. అయితే, ఓ వ్యక్తి ఆనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న సమయంలో తన స్నేహితుడు మూడు స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. వాటిని మసాచుసెట్స్‌లో ఉంటున్న స్నేహితుతు అలెగ్జాండర్ మెక్లిష్ కు ఇచ్చాడు. Read: జైకోవ్ […]
గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ కరోనా మహమ్మారికి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు ఆగస్ట్ 20 వతేదీన అనుమతులు లభించాయి. మూడో డోసుల వ్యాక్సిన్. అంతేకాదు, సూదితో పనిలేకుండా జెట్ అప్లికేటర్ పరికరంతో వ్యాక్సిన్‌ను అందిస్తారు. 12 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కోటి డోసులకు ఆర్డర్ చేసింది. జైకోవ్ డీ వ్యాక్సిన్ ను మొదట దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని ప్రజలకు […]
సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వాలని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా పరిశ్రమను మాత్రం ఎందుకు సమస్యగా చూస్తారన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు […]
హైదరాబాద్ లో ఓ హోటల్లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా […]
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. ఎప్పటి వరకు బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మొదట సౌతాఫ్రికాలో బయటపడింది. ఆ ఈ వేరియంట్‌ను గుర్తించిన వెంటనే సౌతాఫ్రికా అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం సౌతాఫ్రికా వెంటనే అలర్ట్ చేయడాన్ని ప్రశంసించింది. అయితే, మూడు రోజుల వ్యవధిలోనే 30 దేశాలకు కరోనా వ్యాపించడంతో దీని ప్రభావం ఎంతగా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. Read: రికార్డ్: […]
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. అనంతరం సమావేశ వివరాలను ఎంపీ కోమటి రెడ్డి మీడియాకు వెల్లడించారు. జాతీయ రహదారికి 930P నంబరు గల జై శ్రీరామ రహదారిని కేటాయించి DPRని ఆమోదించిందని.. వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ORR జంక్షన్ గౌరెల్లి వద్ద నుండి భూధాన్ పోచంపల్లి -వలిగొండ – […]
సీఎం కేసీఆర్ ఇక జైలుకు పోవడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణలపై త్వరలోనే సీబీఐ, ఈడీ విచారణ చేస్తుందని వంద శాతం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గిస్తే రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పెట్రో, డీజీల్‌పై పన్నును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. డిజీల్ ధరలు […]