చైనా యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారణ చేస్తుంది. ఫోర్జరీ బిల్లులతో రూ.1,100 కోట్లు చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లుల జారీలో సీఏ రవికుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. నకీలీ చైనా యాప్‌లను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు అతడు యత్నించినట్టు నాంపల్లి కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు.
బోగస్ బిల్లుల జారీలో రవికుమార్ పాత్ర ముఖ్యంగా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించారు. ఇవి కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏమైనా లావాదేవీలు జరిపారా అన్న విషయాలను సైతం ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. రవికుమార్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే విచారణకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. ఈ నెల 9వ తేదీ వరకు రవికుమార్‌ను కస్టడీకి అనుమతి ఇస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.