టీఎంసీ ఎంపీ నుస్రత్ ఖాన్ మోడీ ప్రభుత్వం తీరుపై లోక్ సభలో మండిపడ్డారు. దేశంలో నవరత్న, మహారత్న కంపెనీలను అమ్మేయడంపై ఆమె తీవ్రంగా విమర్శించారు. లాభాల్లో వున్న నవరత్న కంపెనీలను ఎడాపెడా అమ్మేయడం ఏంటన్నారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ.. దేశ సంపదను పెంచే కంపెనీలను ఎలా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారని నుస్రత్ ఖాన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నుస్రత్ ఖాన్ ప్రసంగం లోక్ సభలో చర్చనీయాంశం అయింది. సెయిల్, గెయిల్, కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా కంపెనీలను అమ్మడం సరైంది కాదన్నారు.