రోశయ్య పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి : సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రోశయ్య పార్థీవ దేహానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైద్రాబాద్ కలెక్టర్లకు రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!