నారాయణపేట జిల్లా జిలాల్ పూర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 17 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం నుండి నారాయణపేట మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా ఐటీఐ కాలేజి వద్ద బోల్తా పడింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సులు అతివేగంతో ఎప్పుడూ పయనిస్తాయని తెలంగాణ పోలీసులు ఈ బస్సులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు తెలిపారు.