మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సౌమ్యుడు రోశయ్య మరణం తీరని లోటు అని రాజకీయ నేతలు నివాళులర్పించారు. రోశయ్య అందరికీ సూపరిచితులు…ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.
రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు, శాంతమూర్తి. ఎన్నో చరిత్రలు రోశయ్య సొంతం అన్నారు జగ్గారెడ్డి. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. నేను అందరికీ జగ్గారెడ్డిగా పరిచయం. కానీ రోశయ్య తనను జయప్రకాష్ అని పిలిచేవారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో.. జటిలమైన సమయంలో కూడా… ఎవరినీ నొప్పించకుండా రోశయ్య సమయస్ఫూర్తితో వ్యవహరించారని జగ్గారెడ్డి కొనియాడారు.
మూడు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించే వారని, ప్రతిపక్షాలు వైఎస్‌ని కామెంట్ చేస్తే వైఎస్ ఇబ్బందిపడుతున్న సందర్భంలో… ప్రతిపక్షాలను నొప్పించకుండా తెలివిగా కౌంటర్ వేసేవాళ్ళన్నారు. హైదరాబాద్‌లో రోశయ్య మెమోరియల్ కట్టించాలని సీఎంన కోరుతున్నా అన్నారు జగ్గారెడ్డి. అందుకోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కోరారు.