శిల్పా చౌదరిని రెండవ రోజు విచారిస్తున్నారు పోలీసులు. శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు ముందు నోరు విప్పిన శిల్పా రాధికా రెడ్డి అనే రియల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతోంది రాధికా రెడ్డి. దీంతో రాధికా రెడ్డికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. రాధికా రెడ్డి కి ఆరు కోట్లు ఇచ్చింది శిల్పా చౌదరి. ఆరు శాతం వడ్డీకి శిల్పా దగ్గర తీసుకున్న రాధికా రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.