తుఫాన్ కష్టాలు.. మత్స్యకారులకు పస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.
నెల్లిమర్ల నియోజకవర్గంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వకపోవడంతో పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. అధికారులు రోజూ వచ్చి వేటకు వెళ్ళామో లేదో అని తెప్పలు చెక్ చేస్తున్నారు తప్ప తమ బాగోగులు పట్టించుకోవడం లేదంటున్నారు జాలర్లు. మరోవైపు తుఫాను ముప్పు తప్పినా తీరప్రాంతంలో కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ బీచ్ రోడ్డు వైపు, ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్ లోనూ రాకాసి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డు పైకి సముద్రపు అలలు వచ్చి పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read

ఇదిలా వుంటే.. తుపాన్ దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి ఈ తుఫాన్ పూరీకి చేరుకుంటుందని భావిస్తున్నారు. అనంతరం బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరంలో ఇవాళ గంటకు 110 కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రకు భారీ ముప్పు తప్పినా.. మత్స్యకారుల చేపల వేటపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!