కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు. […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా విషయాలు పాపులర్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌ను జోడించడం వలన తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు ఈజీగా పాపులర్ అవుతున్నాయి. ట్విట్టర్లో ఏదైనా ఒక విషయం పాపులర్ కావాలి అంటే ఎవరైనా ఒక సెలబ్రిటీ మనం చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయాలి. అలా రీట్వీట్ చేయడం వలన ఆ ట్వీట్ పాపులర్ అవుతుంది. విషయం అందికి తెలియాలి అంటే తప్పనిసరిగా హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. 2021లో […]
గ్లోబలైజేషన్ తరువాత సాఫ్ట్వేర్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మాత్రమే వారంలో ఐదు రోజులు పనిదినాలు ఉండేవి. ఇప్పుడు అనేక రంగాల్లో పనిచేసేవారికి వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలుగా ఉంటున్నాయి. అయితే, యూఏఈ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగున్న రోజులు పనిదినాలుగా, రెండున్న రోజులు సెలవుగా ప్రకటించింది. Read: సెల్ఫీ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటే ఎలా? గతంలో శుక్ర, శనివారాలు సెలవులు కాగా, ఆదివారం పనిదినంగా […]
చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ఫీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడైనా ఒకటి రెండు ఫొటోలు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని, ఎప్పుడూ అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటే, ఏదోక సమయంలో అభాసుపాలవ్వాల్సి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇలానే ఓ యువతి అందంగా ముస్తాబై బురద కాలువ గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి బురదకాలువలో పడిపోయింది. Read: కరోనా అంతంపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు… ఒళ్లంతా బురద […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వదిలిపోలేదు. రెండేళ్ల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మొదటి తరం కరోనా, ఆ తరువాత డెల్టా వేరియంట్ విజృంభించింది. కాగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొంతమేర డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ విధానం ద్వారా మహమ్మారి 2022 చివరి వరకు […]
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. ధూమపానం చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊపిరితిత్తులతో పాటు లివర్ కూడా పాడైపోతుంది. ఫ్యాషన్ మోజులో పడి యువత సిగరేట్ కాలుస్తూ ఆరోగ్యాన్ని, విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2008 వ సంవత్సరం తరువాత పుట్టిన వారు స్మోకింగ్ చేయకుండా చట్టాన్ని చేసింది. Read: బాలినో భళా… మూడేళ్ల కాలంలో… ఇప్పుడు సిగరేట్‌లో ఉన్న నికోటిన్ శాతాన్ని కూడా క్రమంగా తగ్గించే చర్యలు […]
చిన్న తరహా కార్లకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. పదిలక్షల లోపు ధర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడవుతుంటాయి. ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒకటి. బాలినో కార్లను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారైన ఈ కార్లకు డిమాండ్ ఉన్నది. 2015 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కార్లు 2018 వరకు మూడేళ్ల కాలంలో 5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. Read: వింత సంప్రదాయం: అప్పటి […]
మనదేశంలో ఎన్నో వింత సంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలను పూర్వకాలం నుంచి యథాతధంగా పాటిస్తూ వస్తుంటారు. అలాంటి వాటిల్లో జరుడుకాలనీ గ్రామదేవత జాతర ఉత్సవం ఒకటి. ఈ ఉత్సవాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తారు. సీతంపేట మండలంలోని జరుడుకాలనీ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి గ్రామదేవతకు పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు ఈ జాతరను […]
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రపంచదేశాలు అందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌పై జపాన్ శాస్త్రవేత్త హిరోషి నిషిమురా పరిశోధనలు చేశారు. ఒమిక్రాన్ ప్రారంభ దశలో డెల్టా వేరియంట్ కంటే 4.2 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని, దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యుసమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించినట్టు హిరోషి నిషిమురా పేర్కొన్నారు. Read: భారతీయులు ఎక్కువగా ఎవరి గురించి సెర్చ్ చేశారో తెలుసా…!! […]
గూగుల్ సంస్థ ప్రతి ఏడాది ఇయర్ ఆఫ్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌ను ప్రకటిస్తుంది. ఇండియాలో టాప్ లిస్ట్ లో సినిమా సెలబ్రిటీలు లేదా పొలిటీషియన్లు ఉంటారు. అయితే, ఈ ఏడాది అనూహ్యంగా సెలబ్రిటీలను, పొలిటీషియన్లను కాకుండా జావెలింగ్ త్రోలో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. నీరజ్ చోప్రా తరువాత స్థానంలో ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా ఉండగా, ఐదో స్థానంలో ఎలన్ మస్క్ నిలవడం విశేషం. భారతీయులు […]