ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రపంచదేశాలు అందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌పై జపాన్ శాస్త్రవేత్త హిరోషి నిషిమురా పరిశోధనలు చేశారు. ఒమిక్రాన్ ప్రారంభ దశలో డెల్టా వేరియంట్ కంటే 4.2 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని, దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో నవంబర్ వరకు అందుబాటులో ఉన్న జన్యుసమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించినట్టు హిరోషి నిషిమురా పేర్కొన్నారు.
Read: భారతీయులు ఎక్కువగా ఎవరి గురించి సెర్చ్ చేశారో తెలుసా…!!
అంతేకాకుండా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాధినిరోధక శక్తిని తప్పించుకొని వ్యాప్తి చెందుతోందని హిరోషి తెలిపారు. దక్షిణాఫ్రికాలో టీకా 30 శాతం కంటే తక్కువగా ఉందని, అందుకే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, టీకా అధికంగా తీసుకున్న దేశాల్లో కూడా ఇలానే జరుగుతుందా అనే విషయాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని నిపుణులు పేర్కొన్నారు.