చిన్న తరహా కార్లకు ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. పదిలక్షల లోపు ధర ఉన్న కార్లు దేశంలో అధికంగా అమ్ముడవుతుంటాయి. ఇలాంటి వాటిల్లో మారుతీ సుజుకీ బాలినో కూడా ఒకటి. బాలినో కార్లను 2015లో ఇండియాలో రిలీజ్ చేశారు. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తయారైన ఈ కార్లకు డిమాండ్ ఉన్నది. 2015 అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కార్లు 2018 వరకు మూడేళ్ల కాలంలో 5 లక్షల కార్లు అమ్ముడయ్యాయి.
Read: వింత సంప్రదాయం: అప్పటి వరకు ఆ గ్రామంలో నిషేధం…
కాగా, 2018 నుంచి ఇప్పటి వరకు మరో 5 లక్షల కార్లు అమ్ముడైనట్టు మారుతీ సుజుకీ సంస్థ వెల్లడించింది. ఆరేళ్ల వ్యవధిలో 10 లక్షల కార్లు అమ్ముడు కావడం గొప్ప విషయమని, ఇండియా రోడ్లకు అనుగుణంగా బాలినో కారు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మారుతున్న యువత ఆలోచనలకు అనుగుణంగా ఇంజిన్‌లో మార్పులు చేస్తున్నామని, ఇండియాలో 248 నగరాల్లో 344 ఔట్‌లెట్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయని మారుతీ సుజుకీ తెలియజేసింది.