సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు సాయితేజ దుర్మరణం పాలైన విషయం తెల్సిందే.. చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని లేఖలో తెలిపారు. సాయి తేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే […]
సిద్ధిపేట డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ప్రాముఖ్యమైందన్నారు. కాగా మొదటి సారి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. జిల్లాలో దాదాపు 99 శాతం ఓటింగ్ జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా […]
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ పటం వద్ద నివాళులర్పించిన కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఎం.ఎం. పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. భారత దేశం చాలా క్రిటికల్ జంక్షన్లో ఉందన్నారు. ఇప్పటి వరకు మనకు ప్రత్యర్థి పాకిస్తాన్‌ను సరిహద్దులో ఎదుర్కొంటూ వచ్చాం. గత రెండేళ్లుగా చైనా మన సరిహద్దులో తన ఆధిపత్యం కోసం చాల దూకుడుగా వ్యవహరిస్తూ పాగా వేసిందన్నారు. సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకు […]
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఊహించనంత మోజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతంరం ఆయన మాట్లాడారు…పోలింగ్ ప్రశాంతం గా జరుగుతుందన్నారు. ఇతర పార్టీల సభ్యులు కూడా టి.ఆర్.ఎస్ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, పార్టీలకతీతంగా ఓటేసిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన నల్గొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎంత సస్యశ్యామలం అయిందో స్థానిక […]
రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు ప్రకృతి విపత్తులు, నకీలీ పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పులు వెరసి రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. తాజాగా మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని, ఇంజనీరింగ్ చేసిన కుమారుడికి ఉద్యోగం లేకపోవడంతో బాధపడిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాల హవేలి ఘనపూర్ మండలంల బొగుడ భూపతిపూర్‌లో చోటు చేసుకుంది. […]
ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణకు ఇంకా అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి.కాగా ఇప్పట్లో ఏపీ క్యాబినేట్ విస్తరణ ఉండకపోవచ్చనే సమాధానం మాత్రం వస్తుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో విస్తరించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని గతంలో జగన్ చెప్పినా మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం లేకపోలేదు. అటు విస్తరణలో అందర్ని మారిస్తే వారు శాఖలపై పట్టు సాధించేలోపు ఎన్నికలు వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారు. 7-8 మందితో […]
కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల్లో అత్యధిక భాగం సంపన్న దేశాలు తమ వద్ద అట్టిపెట్టుకోవడం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పదే పదే చెబుతూ వస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తాజాగా మరో హెచ్చరిక చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ అక్రమ నిల్వలను అరికట్టకపోతే ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడం అసాధ్యమని చెప్పింది. వ్యాక్సినేషన్‌పై సమావేశమైన డబ్ల్యుహెచ్ఓ నిపుణుల కమిటీ సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసుల కోసం పెద్దఎత్తున వ్యాక్సిన్లను అంటిపెట్టేసుకున్నాయని, ఈ అదనపు నిల్వలను […]
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో మరోసారి వ్యాక్సిన్ ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా.. బూస్టర్ డోసులు వేయాలని ప్రతిపాదనలు చేస్తున్నాయి పలు దేశాలు. ఇండియాలో కూడా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్రాన్ని కోరాయి. వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ […]
కరోనా వైరస్‌తో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కరోనా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ఏపీలో లేకపోవడంతో ఫలితాల నిర్ధారణ కోసం హైద్రాబాద్‌కు పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే వారంలో రాష్ర్టంలోనే ఈల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ […]