దళితులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని అమలాపురం మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. జగన్ చెల్లెలు కులాంతర వివాహాం చేసుకున్న ఫర్వాలేదు. కానీ ఇతరులు చేసుకుంటే కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం నిలిపివేసిందని హర్షకుమార్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వం నాన్చుడి […]
2014 నుంచి కునారిల్లుతున్న ఏపీ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్ పెట్టిందా? త్వరలో సారథి మారనున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టు నాగంబొట్టు తరహాగా మారింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభలోనూ జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా హస్తవాసి బాగుంటుందా అంటే అలాంటిదేం లేదు. ఏయేటికాయేడు పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. అసలు పార్టీ వుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం […]
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అన్ని దేశాలు బూస్టర్ డోస్ పై చర్చను ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన దేశాలలో బూస్టర్ డోస్‌ను వారి ప్రజలకు ఇస్తున్నాయి. అయితే దీనిపై డబ్ల్యూహెచ్ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూస్టర్ డోస్‌ల పేరుతో వ్యాక్సిన్ నిల్వలను అంటిపెట్టుకోవద్దని వాటి పేద దేశాలకు అందజేయాలని సూచించింది. అయితే మనదేశంలో బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు […]
చెక్ పోస్ట్‌లు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పలమనేరు ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. పలమనేరు కేటిల్ ఫామ్ వద్దనున్న ఆర్టీవో చెక్ పోస్ట్ పై దాడులు చేశారు. తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు నిన్న రాత్రి నుండి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం, చిత్తూరు జిల్లా నరహరి పేట,పలమనేరు ఆర్టీఓ చెక్ పోస్ట్,లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది, ఈ తనిఖీల్లో నరహరి పేట చెక్ పోస్ట్ […]
మన దేశంలో… పెట్రోల్, వంట గ్యాస్, వంట నూనెలతో సహా కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూ ఆకాశన్నంటుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు టమాటో ధరలు రూ.150 చేరుకోగా.. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా అదే దారి పడుతున్నాయి. అయితే.. తాజాగా… చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది. కిలోకి 12 నుంచి 18 వేల రూపాయలు తుగూతాయి. వీలైతే ఒక్కొక్కడికి 30 రూపాయల […]
అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2028 ఒలంపిక్స్‌లో తమ అభిమాన ఆట జెంటిల్మెన్ గేమ్‌గా ప్రసిద్ధి పొందిన క్రికెట్‌కు ఈ సారి కూడ నిరాశే ఎదురయింది. ఒలంపిక్స్లోక్రికెట్ చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. గతంలో 10 ఓవర్ల క్రికెట్‌కు ఒలంపిక్ సంఘంతో పాటు బీసీసీఐ కూడా అంగీకరించింది. కానీ తాజాగా 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఉంటుందని అనుకున్నారు. ఒలంపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో క్రికెట్తోసహా […]
చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో […]
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ. ”హ్యాపీగా ఉండు.. […]
హెలికాప్టర్ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలుచైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్‌రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ […]
ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో […]