అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 2028 ఒలంపిక్స్‌లో తమ అభిమాన ఆట జెంటిల్మెన్ గేమ్‌గా ప్రసిద్ధి పొందిన క్రికెట్‌కు ఈ సారి కూడ నిరాశే ఎదురయింది. ఒలంపిక్స్‌లోక్రికెట్ చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు. గతంలో 10 ఓవర్ల క్రికెట్‌కు ఒలంపిక్ సంఘంతో పాటు బీసీసీఐ కూడా అంగీకరించింది. కానీ తాజాగా 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలంపిక్స్‌లో క్రికెట్‌కు చోటు ఉంటుందని అనుకున్నారు. ఒలంపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో క్రికెట్‌తోసహా బాక్సింగ్, వెయిట్‌లిప్టింగ్, ఆధునిక పెంటాథ్లాన్‌పోటీలు.. చోటును సంపాదించుకోలేకపోయాయి.
2028 ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా క్రికెట్ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఈ నిర్ణయం షాక్‌కు గురిచేసింది. అయితే దీనిపై క్రికెట్ విశ్లేషకులు స్పందించాల్సి ఉంది. భవిష్యత్‌లో క్రికెట్‌ను తప్పకుండా ఒలంపిక్స్‌లో చేర్చవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.