పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్, గనులదోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని […]
చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్లు […]
ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. సింగరేణి బొగ్గు గనులలో నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెనక్కు తీసుకోవాలని ప్రధానిని కోరారు రేవంత్ రెడ్డి. సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరియు వాటిని SCCLకి కేటాయించాలని అభ్యర్ధించారు. బొగ్గు విక్రయం కోసం బొగ్గు గనుల వేలం కోసం 3వ విడతలో సింగరేణి కాలరీస్‌లోని […]
తెలంగాణపై బీజేపీకి ఉన్న వ్యతిరేక భావన బయటపడిందని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్లో ఉన్న గనులు.. ప్రభుత్వ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేసింది. కానీ తెలంగాణలో బొగ్గు బ్లాకులు మాత్రం ఇక్కడి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వడం లేదన్నారు. బొగ్గు బ్లాకులు ఇక్కడి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణలో సింగరేణి […]
ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను […]
అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం మడకశిర పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది.ఈ చెరువు రాష్ట్రంలోని నైరుతి మూలలో కర్ణాటక సరిహద్దులకు సమీపంలోని ఆనుకుని ఉంది. ఈ చెరువు కర్ణాటకలోని సమీప కాలువల ద్వారా తీసుకువెళ్లే వర్షపునీటిపై ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా మడకశిర మునిసిపాలిటీ, సమీప గ్రామాలకు ఇది ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. పట్టణంలోని ప్రజలకు 3కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని అందించేందుకు చెరువుల్లో […]
నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని నేను చూసుకుంటానంటున్నారు లాన్స్ నాయక్ సాయి తేజ సోదరుడు మహేష్.సాయితేజ లేని లోటు తమ కుటుంబానికి తీరని లోటని అని సాయి సోదరుడు మహేష్‌బాబు అన్నారు. అన్న స్ఫూర్తితోనే తాను ఆర్మీలోకి వెళ్లానని మహేష్ తెలిపారు. అన్నకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారిని తాను బాగా చూసుకుంటానన్నారు. ఆర్మీలో అన్న ఎంతో కష్టపడి పనిచేశాడని, బిపిన్ రావత్ మన్ననలు పొందాడన్నారు. అందుకే తన వ్యక్తిగత భద్రతకు అన్నయ్యను నియమించుకున్నారని సాయితేజ […]
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 15 నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు నేటితో ముగుస్తోంది. పోరుబాటను వీడి పొలం బాట పట్టనున్నారు రైతులు. ఢిల్లీలోని సింఘు, తిక్రీ ఘాజీపూర్ సరిహద్దుల్లో గుడారాల్లో ఉంటూ ఆందోళన చేసిన రైతులు పంజాబ్, హర్యానాలోని తమ తమ గ్రామాలకు విజయ యాత్రతో తిరిగి వెళ్తున్నారు. ట్రాక్టర్లపై ఇళ్ళకు వెళ్తున్న రైతులకు స్వాగతం పలికేందుకు హైవేల వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయయాత్ర ను ముందుగా నిన్ననే నిర్వహించాలని […]
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.రూ. 50లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెల్సిందే.. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్ఏ టెస్టులు చేసి […]
కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోట్లాదిమంది అయినవారిని కోల్పోయారు. అయితే కరోనా కారణంగా ఫార్మా రంగం పరిస్థితి మూడు వ్యాక్సిన్లు.. ఆరు శానిటైజర్లలా మారింది. గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిన కంపెనీలు, సాధారణ జనం ఇప్పడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ రూపంలో అలజడి రేగుతోంది. మనదేశంలో గత నెలలో మందుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు 6.6 శాతం పైగా […]