డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా వుంటే వరుణ్ సింగ్ గతంలో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చదివిన హర్యానాలోని […]
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల విలీనం పై మరోసారి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాఠశాలల విలీనం పై కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చిన విషయం తెల్సిందే.. అయితే తాజాగా రాష్ర్టంలో100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో నుంచి ప్రాథమిక పాఠశాలల 3,4,5 తరగతులను విలీనం చేయవద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలో కలపాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలను అసలు విలీనం చేయవద్దని తెలిపింది. 20 మంది కన్నా తక్కువ […]
చలికాలం తీవ్రరూపం దాలుస్తోంది. తెలంగాణలో చలి తన విశ్వరూపం చూపిస్తోంది. డిసెంబర్ రెండవ వారంలోనే పరిస్థితి ఇలా వుంటే.. రాను రాను వాతావరణం మరింత చల్లగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ యూ లో 13.1 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. గిన్నె దరిలో 13.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 13.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు […]
మాయగాళ్ళు అడుగడుగునా పొంచి వున్నారు. ఆదమరిస్తే చాలు ఇంటిని, ఒంటిని కూడా గుల్ల చేసే జగజ్జంత్రీలు తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో ఓ దొంగ ఫక్కీరు బాగోతం బయటపడింది. కొత్తపల్లె మండలం దుద్యాలలో ఫకీరు వేషంలో మోసగించే యత్నం చేశాడో ప్రబుద్ధుడు. నెమలి ఈకల పట్టుకొని మీ ఇంటిని బాగు చేస్తామని మాయ మాటలు చెప్పారు నకలీ ఫక్కీర్లు. ఓ మహిళ బంగారు ఉంగరం కొట్టేసి ప్రయత్నం చేశారు. మత్తులో నుంచి స్పృహలోకి వచ్చిన మహిళ విషయాన్ని చుట్టుపక్కల […]
తెలంగాణ సీపీజీఈటీ-2021లో మొదటి విడతలో సీట్లు సాధించిన వారు కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదిలను అధికారులు పొడిగించారు. రాష్ర్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉతీర్ణులై తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో ఈనెల15వ తేది వరకు రిపోర్టు చేయవచ్చని ప్రవేశ పరీక్షల కన్వీనర్ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు. కాగా అంతకముందు ఈ గడువు ఈనెల10 వరకు ఉండగా మరో 5 రోజులు పాటు పొడిగించినట్లు […]
వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో తీవ్రం ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు మృతి చెందడంతో శవంతో డ్రైవర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15మంది ఓ వ్యాన్ లో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున పువ్వులు తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతీరెడ్డి పల్లి గేటు దగ్గర టైర్ పేలీ వ్యాన్ బొల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ […]
వ్యవసాయ చట్టాలపై అలుపెరుగని పోరాటం చేసిన రైతులు తాత్కాలికంగా తమ పోరాటానికి విరామం ప్రకటించారు. ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం అవనున్నారు రైతులు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సరిహద్దులు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఢిల్లీ సరిహద్దులు సింగూ ,టిక్రి ,గజీపూర్ లలో సంవత్సరంపైగా(378 రోజులు) ఆందోళన చేపట్టారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ,భారతీయ కిసాన్ సంఘ […]
పోలీస్ స్టేషన్‌కు కొన్నిసార్లు వింత వింత కేసులు వస్తుంటాయి. ఆ కేసులను చూసి పోలీసులు షాక్ అవుతుంటారు. కోడి కనిపించడం లేదని, కోడి గుడ్డు పెట్టడం లేదనే కేసులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి కర్ణాటకలోని హోలేహోన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని సిద్లాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు నాలుగు ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను ప్రతిరోజు సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లి […]
దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే… అయితే టాంజానియా నుంచి ముంబైలోని […]
చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ కారణంగా కాలుష్యం పెరిగిపోతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్, గ్యాస్ తో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలు వాహనాలకు వినియోగించే బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే, భవిష్యత్తులో హైడ్రోజన్‌తో నడిచే వాహనాలను, హైడ్రోజన్‌తో ఎలక్ట్రిసిటీని, హైడ్రోజన్ వంట గ్యాస్‌ను వినియోగించే రోజులు రాబోతున్నాయి. నీటినుంచి ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను వేరుచేస్తారు. ఈ హైడ్రోజన్ గ్యాస్ రూపంలో జనరేటర్లలో స్టోర్ చేసి కార్లకు […]