శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యా సభలో జీరో అవర్‌లో కడప జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టెక్స్టైల్ పార్క్ ఆవశ్యకతను వివరించారు. కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏడు “మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్”, “అప్పరెల్ పార్కు” (మిత్రా) చేయాలని నిర్ణయించిందని దీన్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని […]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంతో టీఆర్ఎస్ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రతి పక్షాలు సంఖ్యా బలం లేకున్నా పోటీ చేశాయన్నారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి ఏదో రకంగా గెలవాలని చూశాయన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు […]
సుప్రీం కోర్టు బెంచ్ పెడితే భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచడానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేవలం నలుగురు (9 శాతం), […]
టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కుట్రలు ఓడిపోయాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కోటిరెడ్డికి పార్టీలకతీతంగా మద్దతు తెలిపి మెజార్టీ ఇచ్చి గెలిపించారన్నారు. తక్కువ ఓట్లు ఉన్న జిల్లాలో పోటీ చేసిన […]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే […]
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలోఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని (GFZ) జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి దారి […]
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని సోమవారం లోక్‌సభలో జీర్ అవర్‌లో అత్యవసర ప్రజాప్రయోజనాల అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన డిమాండ్‌పై ప్రహ్లాద్ జోషి […]
తెలంగాణలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు, రైతులు నష్టపోయిన తీరుపై ఎలాంటి పరిహారం ఇచ్చారో చెప్పాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) రాష్ర్టప్రభుత్వాన్ని, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశంచింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టును నిర్మించడంతో 50వేల ఎకరాలకు మేర సారవంతమైన పంట భూములు మునిగిపోయాయి. దీంతో రైతులతో పాటు కౌలు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారని న్యాయవాది శ్రవణ్ NHRC […]
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు, నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా రైతులఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. డిసెంబర్ 15 అంటే రేపటి నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం […]
డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆ కోర్సులు తమకు నచ్చకుంటే వేరే కోర్సుల్లో చేరేందుకు మూడు రోజుల గడువును ఇచ్చింది. తెలంగాణ రాష్ర్టంలో ఇప్పటికే దోస్త్ ద్వారా కాలేజీల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు మూడోవిడత కింద కోర్సులను మార్చుకునేందుకు ఇంట్రా కాలేజీ స్లైడింగ్‌కు ఉన్నత విద్యామండలి అవకాశం ఇచ్చింది. Also read: పీహెచ్‌డీలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్లో భాగంగా ఈ నెల15 నుంచి 17 వరకు విద్యార్థులు వెబ్ […]