స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు. […]
సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 25వ తేదీ లోపు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తుకు సంబంధించి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలిచ్చింది. విదేశాల్లో కూర్చొని మన దేశంలో ఉన్న న్యాయవ్యవస్థను విమర్శించడంపై సీరియస్ అయింది హైకోర్టు ధర్మాసనం. వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది సీజే ధర్మాసనం. పంచ్ ప్రభాకర్ కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ పేర్కొంటూ జాప్యం చేస్తున్నారన్నారు హైకోర్టు తరపు […]
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకార ధోరణే. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు […]
చాలా దేశాల్లో సంపాదించే డబ్బుకన్నా కట్టాల్సిన టాక్స్‌లు అధికంగా ఉంటాయి. చట్టాలు కూడా కఠినంగా ఉండటంతో ఖచ్చితంగా ట్యాక్స్‌లు కట్టాల్సిఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు ట్యాక్స్‌లు తక్కువగా ఉండే దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అమెరికాలో టాక్స్‌లు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అందుకే చాలామంది డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటున్నారు. చాలా దేశాలు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా క్రిప్టో కరెన్సీ వాడకానికి అనుమతులు ఇవ్వడంతో వస్తువులను, ప్రాపర్టీస్‌ను క్రిప్టో నుంచి కొనుగోలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల్లో విదేశీయులకు […]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆమె కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రుణ సేకరణపై విధించిన సీలింగ్, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కడపలో ఏర్పాటు చేస్తున్న వై.ఎస్.ఆర్ స్టీల్ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి. గురువారం నాడే ప్రధాని మోడీతో విజయసాయి భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత […]
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాలు తెలిసినప్పటికీ పొగతాగడం మానడం లేదు. పొగ తాగడం వలన ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. శ్వాససంబంధమైన జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక, పొగతాగడం వలన గుండెసంబంధమైన జబ్బులు అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదు. గుండెజబ్బులతో పాటు, క్యాన్సర్ వంటివి కూడా సోకే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంచితే కరోనా మహమ్మారి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు […]
హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందడం వివాదాస్పదం అయింది. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. నాదర్ గుల్ కి చెందిన స్వప్న అనే మహిళ నాలుగురోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. పాప ఏడుస్తుందని సిబ్బందికి చెప్పగా సిబ్బంది వచ్చి చూసి వెళ్ళారు. కొద్దిసేపటి తరవాత పాప ఏడుపు ఆపి కళ్ళు మూసుకోవడంతో డాక్టర్ లు వచ్చి పాప చనిపోయింది అని చెప్పారు. ముందే […]
ప్రపంచం మొత్తంమీద ప్రస్తుతం కరోనాతో అత్యంత ఇబ్బందులు పడుతున్న దేశం ఏంటని అంటే బ్రిటన్ అని టక్కున చెప్పేస్తున్నారు. సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్లు ఇప్పుడు అత్యధికంగా బ్రిటన్‌లోనే కనిపిస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశం అప్రమత్తం అయింది. గతంలో విధించిన లాక్డౌన్ ల దెబ్బకు ఆర్థికంగా కుదేలైంది. ప్రజలను మహమ్మారుల నుంచి బయటపడేసేందుకు ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నది. Read: యూరప్‌ను వణికిస్తున్న ఒమిక్రాన్… ఫ్రాన్స్‌లో […]