ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్‌లు ఉండటం సహజమే. అయితే, ఒక వీధి రోడ్డు నుంచి మరో వీధి రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలి లేదా వీధి గుండా వెళ్లాలి. రెండు ఇళ్ల మధ్యగుండా ఖాళీ స్థలం ఉండి, ఆ ఖాళీ స్థలం గుండా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటే దానిని వీధి అని పిలుస్తారు. వీధి అంటే విశాలంగా ఉంటాయి. […]
దేశంలో బీసీ జనాభా ఎంత వుందో కులగణన చేస్తేనే తెలుస్తుందని బీసీ నేతలు అంటున్నారు. ఏపీలో టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు ఢిల్లీ వేదికగా బీసీ కులగణన కోసం పోరాడుతున్నారు. బీసీ కులగణన సాధించేవరకు నేను మీ వెంటే ఉంటానని, జనగణనలో కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. టీడీపీకి వెన్నెముకగా బీసీలు నిలిచారన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీల డిమాండ్ల కు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం అన్నారు. బీసీల కార్యక్రమం ఎక్కడ […]
సంచలనం కలిగిస్తున్న శిల్ప చౌదరి కేసులో రోజుకో కొత్త కథ బయటకు వస్తోంది. శిల్ప చౌదరి హై ఫై లైఫ్ ను ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. సంపన్నుల దగ్గర్నుంచి వడ్డీ రూపంలో డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది శిల్ప. దివినోస్ క్లబ్ పేరుతో కిట్టి పార్టీలను ఏర్పాటు చేసిన శిల్ప వీఐపీలను ఆకట్టుకుంది. వారిని బుట్టలో పడేసుకుంది. కిట్టి పార్టీలకు హీరో హీరోయిన్లను ఆహ్వానించేవారు శిల్ప. సంపన్నులను ప్రసన్నం చేసుకున్న శిల్ప దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి […]
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన చేష్టలతో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అంగారకుడిపై మనిషిని పంపడమే లక్ష్యంగా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. 2002లో మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థను నెలకొల్పాడు. నాసాతో కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నది ఈ సంస్థ. స్పేస్ ఎక్స్ సంస్థ 100 మెట్రిక్ టన్నులు మోసుకెళ్లే సామర్థ్యంతో కూడిన స్టార్ షిప్ ను తయారు చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ స్టార్ షిప్ […]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 1, 2022 నుంచి పెన్షన్ రూ.2500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్.జగన్ సర్కార్ కానుక అందించింది. పెన్షన్‌ను రూ.2500కు పెంచి ఇవ్వనుంది ప్రభుత్వం. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో రూ.2500 పెన్షన్ మొత్తాన్ని పెట్టనుంది వైయస్.జగన్ సర్కార్. కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్. డిసెంబర్, జనవరిల్లో కార్యక్రమాలను జగన్ వివరించారు. స్పందన వీసీలో […]
హైదరాబాద్ మాదాపూర్ లోని కారు గ్యారేజ్ లో జరిగిన చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.55 లక్షలు రికవరీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలక్ష్మీ మోటార్స్ కార్ గ్యారేజ్ లో ఈ నెల 9 న దొంగతనం జరిగింది.శ్రీ మోటార్స్ కారు సర్వీసు వర్క్ షాప్ లో ఉన్న 55 లక్షల నగదును దోచుకెళ్ళారు. కారు షో రూమ్‌లో మెకానిక్ గా పని చేసే వ్యక్తే ప్రధాన సూత్రధారిగా తేలింది. […]
బిఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్పోర్ట్ వెహికిల్ ఐఎక్స్ బుకింగ్ ను ఈరోజు అధికారికంగా ప్రారంభించింది. అధికారికంగా ప్రారంభించిన తొలిరోజే పూర్తిస్తాయిలో అమ్ముడయ్యాయి. ఆన్లైన్ విధానంతో పాటుగా, డీలర్‌షిప్‌లో కూడా కార్లను బుక్ చేసుకున్నారని బీఎండబ్ల్యూ తెలియజేసింది. బుకింగ్ చేసుకున్న వాహనాలను 2022 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలియజేసింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో రెండోదశ బుకింగ్‌లు ప్రారంభమైతాయని బీఎండబ్ల్యూ సంస్థ ప్రకటించింది. బీఎండబ్ల్యూ మొత్తం మూడు ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేయబోతున్నది. అందులో ఐఎక్స్ ఒకటి. […]
ఉత్తరాఖండ్‌లో రెండు లైన్ల జాతీయ రహదారి (ఛార్‌ధామ్) ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణకు మంగళవారం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు గల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కేంద్రం వినిపించిన వాదనలను సుప్రీం కోర్టు ఏకీభవించింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించింది. అయితే ఈ ప్రాజెక్టులో సరిహద్దు భద్రతా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు పేర్కొంది. Also Read: బూస్టర్ […]
పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ జనగణన అంశం పై మాట్లాడారు. బీసీల సమస్యలను సభకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే.. కానీ బలహీనులు కాదన్నారు. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవడం లేదన్నారు. సామాజిక వెనకబాటు ఉన్న వారికి రిజ్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. Also Read: సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భారత దేశంలో […]
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంతో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్జిల్లాలో ఎస్ ఆర్ఆర్ కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఓటర్లు మద్దతు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ బలపర్చిన భానుప్రసాద్, ఎల్. రమణలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మంత్రి గంగుల కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానాలను ఎన్నికల వరకు తీసుకెళ్లారన్నారు. 1324 ఓట్లలో 1063 ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయన్నారు. ఇతర పార్టీల ఓట్లు 324 ఉండగా […]