ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సెమెరు అగ్నిపర్వతం ఇటీవలే బద్దలైంది. సెమెరు పర్వతం బద్దలవ్వడంతో ఆ పర్వతం వచ్చిన బూడిద సుమారు 11 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ పర్వతం దగ్గరలో బెసుక్ కొబొకన్ నది ఉన్నది. ఈ నది మొత్తం ఇప్పుడు బూడిద కుప్పలా మారిపోయింది. అంతేకాదు, ఈ ఆగ్రపర్వతానికి దగ్గరలో ఉన్న గ్రామాలు సైతం బూడిదతో కప్పబడ్డాయి. సెమెరు పర్వతానికి ఎటువైపు చూసినా కనుచూపు మేరలో బూడిద తప్పించి మరేమి కనిపించడం లేదు. Read: […]
ఎప్పుడూ రాజకీయాలు.. ఎన్నికలు.. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలే కాదు కాస్త ఆటలు కూడా ఆడాలంటున్నారు మంత్రి హరీష్ రావు. పైగా ఆయనిప్పుడు వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా ఫిట్ గా వుండడానికి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. గతంలోనూ ఆటవిడుపుగా క్రికెట్ ఆడిన సందర్భాలున్నాయి. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను గాడిన పెట్టే పనిలో బిజీగా వున్న హరీష్ రావు క్రికెట్ ఆడడం ద్వారా సరదాగా గడిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్‌ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.బయటకు రాలేకే మృతిచెందారు. ప్రమాదంలో వెంటనే […]
శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ తరువాత వరంగల్‌లో ఎక్కువగా జరుగుతున్నాయని, ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతోనే వరంగల్‌లో ఈవెంట్లు నిర్వహించగలుగుతున్నామని దిల్ రాజు అన్నారు. వరంగల్‌లో ఎంసీఏ సినిమా షూటింగ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించామని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని, ఇప్పుడు అదే వరంగల్‌లో శ్యామ్ […]
వరంగల్ గడ్డమీద నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అఖండమైన విజయాలను నమోదు చేసుకోబోతుందని అన్నారు. Read: కేసులు పెరుగుతున్నాయి … జాగ్రత్తగా ఉండాలి… డిసెంబర్ 17న బన్నీ పుష్ప సినిమా వస్తుండగా, వచ్చే […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో తన క్యాంప్ ఆఫీస్‌లో తిరు కె.చంద్రశేఖర్ రావు మంత్రి కేటీఆర్‌తో కలిసి తనను మర్యాదపూర్వకంగా కలిశారని, అద్భుత సమయాన్ని తనతో గడిపారని ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేసీఆర్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ భేటీలో ఇద్దరు సీఎంలు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. READ ALSO తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు. పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా […]
కరేబియన్ దీవి హైతీలో ఘోరప్రమాదం సంభవించింది. కేప్ హైతియాన్లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా మృతి చెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దాదాపు 20 కి పైగా ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్టు స్థానిక డిప్యూటీ మేయర్ పాట్రిక్ పేర్కొన్నారు. మృతుల సంఖ్యను ఇప్పుడే అంచనావేసి చెప్పలేమని, ఇళ్లల్లో ఉండి మరణించిన వారిని గుర్తించాల్సి ఉందని, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంపై హైతీ ప్రధాని […]