వరంగల్ గడ్డమీద నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అఖండ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అఖండమైన విజయాలను నమోదు చేసుకోబోతుందని అన్నారు.
Read: కేసులు పెరుగుతున్నాయి … జాగ్రత్తగా ఉండాలి…
డిసెంబర్ 17న బన్నీ పుష్ప సినిమా వస్తుండగా, వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాబోతున్నదని, ఈ రెండు సినిమాల మధ్యలో డిసెంబర్ 24 వ తేదీన శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ అవుతుందని, రెండు సినిమాల మధ్యలో రిలీజ్ అవుతున్నప్పటికీ తగ్గేది లేదని నాని అన్నారు. డిసెంబర్ 24న మంచి విజయం సాధిస్తామని నాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.