IND vs NZ ODI: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ఈరోజు ( జనవరి 3న) ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే జట్టును సెలక్ట్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ మీటింగ్ తర్వాతి రోజు జరుగుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యలకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ల వన్డే భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Ravi Teja: ‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ
అయితే, ఈ సిరీస్‌కు పంత్, సిరాజ్ ఎంపిక కాకుంటే వన్డేల్లో వీరి కెరీర్ దాదాపుగా ముందుకు సాగడం కష్టమనే విషయం తేలిపోతుంది. ఈ ఫార్మాట్లో వీరి ఫామ్ అంత గొప్పగా లేదు.. ఈ ఇద్దరూ తుది జట్టులో ఆడి కూడా చాలా ఏళ్లైంది. దేశవాళీల్లో సత్తా చాటుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. కివీస్‌తో సిరీస్‌కు సెలక్ట్ అవుతాడనే ఆశాభావంతో ఉన్నాడు. న్యూజిలాండ్ తో మూడు వన్డేలు ఈ నెల 11, 14, 18 తేదీల్లో జరగనున్నాయి. జనవరి 21వ తేదీ నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేశారు.